Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది స్పాట్..

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే ధోల్‌పుర్‌ జిల్లాలో సునిపుర్ గ్రామ సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న స్పీపర్ బస్సు ఢీకొట్టింది. జాతీయ రహదారిపై వెళ్లే ఇతర వాహనాల డ్రైవర్లు వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మొత్తం 12 మంది మృతి చెందగా, ఇందులో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *