Cruelty: ఉత్తర కన్నడలో మాంసం కోసం గర్భిణీ ఆవును చంపి, దూడను బయటకు విసిరేసిన ఘటన కొద్దీ రోజుల క్రితం కలకలం సృష్టించింది. ఈ ఘటన జరిగిన 46 రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, కార్వార్‌లోని హొన్నావర్‌లోని కొండకులి గ్రామంలో, ఒక గర్భిణీ ఆవును చంపి, లోపల ఉన్న దూడను బయటకు విసిరివేసి, మాంసం దొంగిలించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నేరస్థులను అరెస్టు చేయాలని నిరసనలు చేపట్టారు. చివరికి, ఇద్దరు అనుమానితులు, ముజామిన్,వసీంలను అరెస్టు చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గోవధకు సంబంధించి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అల్తాఫ్ కడపురుసు, మదీన్ కడపురుసు, మహమ్మద్ హసన్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో వీరు వసీం, ముజామిన్ వారి గురించి సమాచారం అందించారు. అప్పటికి వారిద్దరూ ధార్వాడ్ వెళ్లి అక్కడి నుండి ముంబైకి పారిపోయారు. పోలీసులు మహారాష్ట్రకు వెళ్లి వసీంను అరెస్టు చేశారు. డబ్బు లేకపోవడంతో ఊరికి తిరిగి వచ్చిన ముజామిన్‌ను అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Marks Tension: మార్కుల కోసం అమ్మ నాన్న టార్చర్ భరించలేను.. నేనింటికి పోను.. పోలీసులకు విద్యార్ధి ఫిర్యాదు!
పట్టించిన గూగుల్ పే..
వీరంతా పాట్కల్‌లోని ఒక వివాహ వేడుకలో విందు కోసం ఆవు మాంసం ఇస్తామని ఈ ఐదుగురు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని కోసం కొనుతుకులి గ్రామంలో మేతకు వదిలిన గర్భిణీ ఆవును పట్టుకున్న వ్యక్తులు దానిని కర్కశంగా చంపేశారు. ఆవు మాంసం తీసుకున్న వీరు.. దూడను బయటకు విసిరేశారు. ఈ మాంసానికి సంబంధించిన మొత్తాన్ని వివాహ బృందం నుండి ‘గూగుల్ పే’ ద్వారా వీరు తీసుకున్నారు. దీంతో పోలీసులకు నేరస్థులను పట్టుకోవడం సులభం అయింది.
46 రోజుల పాటు.. ఐదు రాష్ట్రాల్లో..
గత 46 రోజులుగా, పోలీసులు ఐదు రాష్ట్రాలలో 11,000 కి.మీ ప్రయాణించి నేరస్థుల కోసం వెతుకుతున్నారు. 130 ప్రదేశాలలో నిఘా కెమెరాలను పరిశీలించారు. 400 మందిని ప్రశ్నించారు. నిందితులకు సంబంధించిన రహస్య సమాచారం అందించిన ఇద్దరు వ్యక్తులకు రూ.50,000, రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించారు.