Aamir Khan

Aamir Khan: అన్ని సినిమాలకు సంతకం.. ఇంటికి వెళ్లి ఏడ్చేవాడిని

Aamir Khan: సినిమాలో నటించాలి అని అందరూ అనుకుంటారు.. అవకాశాలకోసం ఎదురు చూస్తూనే కొంత మంది జీవితాలు గడిచిపోతాయి కూడా.. కొంతమందికి సినిమాలో ఛాన్స్ వచ్చి అది హిట్ అయితే దాని చూసుకొని మరో కొన్ని సినిమాలకి అవకాశాలు వస్తుంటాయి.. అలాంటి సంఘటన గురించే అమీర్ ఖాన్ గుర్తు తెచ్చుకున్నారు. 

అమిర్ ఖాన్ బర్త్ డే ని పీవీఆర్‌ ఐనాక్స్‌ ‘ఆమిర్‌ ఖాన్‌ : సినిమా కా జాదూగర్‌’ పేరుతో ఘనంగా చేయనున్నారు. దీనిలో భాగంగానే ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన సినిమా కెరీర్ 

తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను చేసిన ఒక సినిమా బారి విజయం సాధించడంతో ఒకేసారి పది సినిమాలకి సంతకం చేసి తర్వాత ఇబ్బంది పడినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: L2E Empuraan: పాన్ ఇండియా రేంజ్ లో లూసిఫర్ సీక్వెల్!

తను చేసిన సినిమా హిట్ కావడంతో ఒక్కేసారి 300-400 సినిమా ఆఫర్ లు వచ్చాయి.ఆ సమయంలో ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక వచ్చిన వాటిలో  10 సినిమాలకి సంతకం చేశాను. ఆ సమయంలో కొంత మంది ఒక్కేసారి 50 సినిమాలు వర్క్ చేసేవారు. అనిల్ కపూర్ 33 సినిమాలు చేసేవారు. వాలని సుప్తిగా తీసుకోని నేను 10 సినిమాలు చేశాను. కానీ ఒపుకున్నపుడు తెలియలేదు కానీ సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యా తర్వాత అవి పూర్తి చేయడానికి రోజుకి 3 షిఫ్టులు చేసేవాడిని. వాటి షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్లి ఒత్తిడితో ఏడ్చేవాడిని’’ అని అన్నారు.తాను వర్క్ చేయాలి అని అనుకున్న డైరెక్టర్ లు అవకాశాలు ఇవ్వలేదు తెలిపారు. 

తన కెరీర్ లో వచ్చిన పరాజయాల విషయంలో ఎవరిని నిందించాను అని అన్నారు.. తాను నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకి నచ్చలేదు అని తెలిపారు. ఒకే సంవత్సరం మూడు సినిమాలు వచ్చి ప్లాప్ ఐన రోజులు కూడా ఉన్నాయి.. వాటి ప్రభావం తర్వాత వచ్చే 6 సినిమాల మీద ఉంటుంది అని నాకు తెలుసు. ఈ విషయం గురించి ఎవరిని నిందించను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఇలాంటివి సహజం’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *