Kiran Abbavaram

Kiran Abbavaram: పవన్ ఇమేజ్ పై ఆధారపడ్డ కిరణ్ అబ్బవరం!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం చాలా ప్లాపుల తర్వాత “క” సినిమాతో ఓ మోస్తారు హిట్ కొట్టాడు. ఇప్పుడు ఇదే జోష్ లో దిల్ రుబా అనే సినిమాతో వస్తున్నాడు.ఇక ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ చేసిన మూవీ టీమ్.. ఇప్పుడు నాలుగో సాంగ్ కేసీపీడీని రిలీజ్ చేసేసింది. ఇందులో కాలేజీ హాస్టల్ లో జరిగే ఫైట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ఉంటుంది.సాంగ్ లో హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యర్థులను కొట్టడానికి తాళాలు తీసుకుని వెళ్తాడు. ఆ టైమ్ లో హాస్టల్ డోర్ కు ‘బ్రో’ సినిమాలోని పవన్ కల్యాణ్‌ పోస్టర్ అతికించి ఉంటుంది. ఆ పోస్టర్ మధ్యలో నుంచి సేమ్ అదే డ్రెస్ లో కిరణ్‌ అబ్బవరం ఎంట్రీ ఇవ్వడం ఇందులో కనిపిస్తుంది. ఈ సీన్ కు కచ్చితంగా థియేటర్లలో విజిల్స్ పడుతాయని అంటున్నారు. కొందరేమో కిరణ్ అబ్బవరం హిట్ కోసం పవన్ కల్యాణ్‌ ఇమేజ్ ను బాగానే వాడుకుంటున్నాడని చెబుతున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం కిరణ్ ను సపోర్టు చేస్తున్నారు. ఎందుకంటే తాను పవన్ కల్యాణ్‌ వీరాభిమాని అని గతంలో కిరణ్‌ అబ్బవరం చాలా సార్లు చెప్పుకున్నాడు. మరి పవన్ ఇమేజ్ కిరణ్ అబ్బవరంకి ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *