Adi Srinivas

Adi Srinivas: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

Adi Srinivas: సిరిసిల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి పాల్గొన్నారు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. దాదాపు 800 ఏళ్ల సంవత్సరాల ప్రాశస్త్యం, చరిత్ర కలిగినటువంటి సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రథోత్సవ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు భక్తులు, ఆలయ అధికారులు పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ జరిగే రథోత్సవ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది పైగా భక్తులు పాల్గొన్నారు.

ఈ రథోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆనవాయితీగా సాంప్రదాయ బద్ధంగా గత 700 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల మాదిరిగా జరుగుతున్నటువంటి సిరిసిల్ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై రథోత్సవంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకుపోయి పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అందేలా మరియు లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇట్టి రథోత్సవంలో వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *