PM Modi:

Pm modi: ఛాంపియన్స్ లీగ్ విజేతపై మోడీ ఏమన్నారంటే..

Pm modi: దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్‌లో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో యావత్ భారత దేశం ఉత్సాహంతో మునిగిపోయింది.

టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, “ఒక అసాధారణ ఆట… ఒక అసాధారణ ఫలితం!” అంటూ భారత జట్టు ప్రదర్శనను కొనియాడారు.

“ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకువచ్చిన మన క్రికెట్ జట్టు ప్రదర్శన పట్ల గర్విస్తున్నాను. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారు. అమోఘమైన ఆల్-రౌండ్ ప్రదర్శనతో అలరించిన మన జట్టుకు హృదయపూర్వక శుభాభినందనలు,” అని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *