First Night

First Night: శోభనం రోజు భర్త ముందే.. లవర్‌కి వీడియో కాల్.. సీన్ కట్ చేస్తే..!

First Night: ఈ మధ్య అమ్మాయిలు ఇలా తయారు అవుతున్నారు ఏంటి. పెళ్లి ఇష్టం లేకపోతె ఇష్టం లేదు అని చెప్పాలి . అంతే కానీ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాడిని పైకి పంచడం ఎంత వరకు కరెక్ట్. ప్రియుడిపై ప్రేమ ..తాళి కట్టిన వాడిపై కోపం. ఇదెక్కడి పంచాయితీ. పెళ్లి కి ముందు రాని ఆలోచనలు ..పెళ్ళైన తర్వాత థింక్ చేసి ..హత్యలు ఎందుకు చేస్తున్నట్లు. భార్య, భర్త, ప్రియుడు …ఫైనల్లీ జైలు

సృష్టిలో స్త్రీ, పురుషుల బంధం చాలా ప్రత్యేకమైంది. పెళ్లి అనే రెండు అక్షరాలతో అమ్మాయి-అబ్బాయి వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. నాటి నుంచి ఒక కుటుంబంగా ఏర్పడతారు. భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటిది ఈ మధ్య జంటలు.. వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. కలకాలం తోడుంటామని ప్రమాణం చేసిన వాళ్లే… అర్ధాంతరంగా భాగస్వాములను కాటికి పంపిస్తున్నారు. ఇదంతా ఎందుకుంటారా? అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసిన భర్తనే పైకి పంపాలనుకుంది ఓ నవ వధువు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read: Jagtial: జగిత్యాల జిల్లా రామచంద్రంపేటలో విషాద ఘటన

కడలూరు జిల్లా కరువెపంపట్టికి చెందిన కలైయారసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ యువతితో జనవరి 27, 2025న పెళ్లైంది. అదే రోజు నవ దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎన్నో కలలతో.. ఎన్నో ఊహలతో వరుడు శోభనం గదిలోకి అడుగుపెట్టాడు. ఏదేదో.. ఊహించుకుని భార్య దగ్గరకు వెళ్తే.. మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. ప్రియుడితోనే జీవిస్తానని తెగేసి చెప్పింది. అంతేకాదు.. భర్త ముందే వీడియో కాల్ చేసి ప్రియుడితో మాట్లాడింది. ఒక్కసారిగా వరుడు నిశ్చేష్టుడయ్యాడు. దీంతో శోభనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు.

అత్తింటిలో ఉంటూనే ఆమె రోజు ప్రియుడికి ఫోన్ చేస్తూ మాట్లాడుతుంది. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కలైయారసన్ తెలియజేశాడు. అంతేకాకుండా ఫిబ్రవరి 12న భార్యను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. తిరిగి భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. అమ్మాయి ఇంటి నుంచి కొందరు బంధువులు కలైయారసన్ ఇంటి మీదకి గొడవకొచ్చారు. ఆమెతోనే కాపురం చేయాలని అర్ధరాత్రి 12 గంటల సమయంలో కలైయారసన్‌ను ఇంట్లో కట్టేసి కొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *