ChiruAnil: అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అనిల్ తన బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీమ్‌ను మరోసారి రిపీట్ చేయనున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ఎడిటర్ తిమ్మరాజుతో పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ మొత్తం ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నారట. ఈ టీమ్‌ను మరోసారి రిపీట్ చేయనుండటంతో మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

