SSMB29

SSMB29: మహేష్ క్యారెక్టర్ కి పవర్ఫుల్ నేమ్!

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB29 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించుకుంటున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పేరు ప్రత్యేకంగా నిలవనుందని తెలుస్తోంది. ఇది సినిమాలో హీరో పేరని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మహేష్ పాత్రకు ఇలాంటి పవర్‌ఫుల్ పేరు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో KL నారాయణ తెరకెక్కిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *