Manamey: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా వచ్చిన చిత్రం మనమే. యంగ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం గత ఏడాది జూన్ లో రిలీజ్ కి వచ్చింది. కానీ అప్పుడు నుంచి ఓటిటి రిలీజ్ కి నోచుకోలేదు. దీనితో అప్పుడు నుంచి ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కి ఫైనల్ గా అందుబాటులోకి వచ్చేసింది.ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకోగా ఈరోజు మార్చ్ 7 నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ ఫ్యామిలీ డ్రామాని అపుడు మిస్ అయ్యి చూడాలి అనుకునే వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణం వహించారు.
