ప్రియదర్శి, సమంత హీరోహీరోయిన్లుగా సినిమా రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉంది సామ్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ స్టీమింగ్ కు రెడీ అవుతోంది. ఆమె సెలెక్టివ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఆమె చివరి చిత్రం విజయ్ దేవరకొండతో తీసిన ఖుషి సినిమా. ఇది బాక్సాపీసు వద్ద యావరేజ్ గా నిలిచింది.
తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ పై తనే లీడ్ క్యారెక్టర్ లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. తాజాగా మరో సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించబోతుందట. అయితే, ఈ సినిమాలో ప్రియదర్శి హీరో అనే వార్త చక్కర్లు కొడుతోంది. ప్రియదర్శితో సమంత జోడీ కట్టనుందన్న వార్త ప్రస్తుతం అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేసింది. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సమంత ఇప్పుడు సినిమాలు లేకనే చిన్న సినిమాలు చేస్తుందన్న టాక్ నడుస్తోంది.
ఇక సమంత పలు చిన్న సినిమాలను తన సొంత బ్యానర్ పై నిర్మించేందుకు రెడీ అవుతోంది. మరి ప్రియదర్శిసమంత కాంబినేషన్లో నిజంగానే సినిమా వస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే సినిమాలు కూడా నెమ్మదిగా చేస్తోంది.

