Delhi New CM

Delhi New CM: ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అప్పుడే.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్!

Delhi New CM: ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 19 లేదా 20 తేదీల్లో ఢిల్లీలో జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. నిన్న ఢిల్లీలో బిజెపి నాయకుల సమావేశం కూడా జరిగింది. 48 మంది ఎమ్మెల్యేలలో 9 మంది పేర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. అందులోంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారు. ప్రధాని మోదీ ఈరోజు అమెరికా పర్యటన నుండి తిరిగి వస్తున్నారు. దీని తర్వాతే ఢిల్లీ సీఎం పేరు ప్రకటించే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థులలో ఒకరైన ప్రవేశ్ వర్మ మాట్లాడుతూ – బిజెపి ప్రభుత్వ ప్రధాన ఎజెండాలో అభివృద్ధి, స్వచ్ఛమైన నీటి సరఫరా, స్వచ్ఛమైన గాలి వంటి అంశాలు ఉన్నాయి. దీనితో పాటు, యమునా నది శుభ్రపరచడం కూడా ఇందులో ఉంది. పార్టీ ఈ దిశలో పనిచేయడం ప్రారంభించింది. నదిని శుభ్రపరిచే తన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది.

ఇది కూడా చదవండి: Shocking News: ఆ రాష్ట్రంలో మద్యం తాగడంలో మహిళలు మగాళ్లతో పోటీ పడుతున్నారు

ఫిబ్రవరి 8న ప్రకటించిన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో, 70 సీట్లకు 48 సీట్లు గెలుచుకుని 26 సంవత్సరాల తర్వాత బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే, ఈసారి కూడా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. బిజెపి తన సీట్లను 71% స్ట్రైక్ రేట్‌తో 40 పెంచుకుంది. అదే సమయంలో, ఆప్ 40 సీట్లను కోల్పోయింది. ఆప్ స్ట్రైక్ రేట్ 31%గా ఉంది.

శాసనసభా పక్ష సమావేశానికి ముందు పరిశీలకులను నియమిస్తామని బిజెపి ఎమ్మెల్యే, జాతీయ కార్యదర్శి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఫిబ్రవరి 18 లేదా 19 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. లక్ష్మీ నగర్ స్థానం నుండి రెండోసారి ఎమ్మెల్యే అయిన అభయ్ వర్మ మాట్లాడుతూ – ఢిల్లీ సీఎం పదవికి పోటీ లేదు. మా పార్టీలో ముఖ్యమంత్రిని లేదా శాసనసభా పక్ష నాయకుడిని ఎమ్మెల్యేల సమావేశంలో ఎన్నుకుంటారు అని చెప్పారు. అదే సమయంలో, ఎన్నికైన ఎమ్మెల్యేలలో నుంచే ముఖ్యమంత్రి ఉంటారని, ప్రధాని మోడీ తిరిగి వచ్చిన తర్వాత జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *