Champions Trophy 2025

Champions Trophy 2025: తొలి వన్డేలో శ్రీలంక స్ఫూర్తిదాయక విజయం..! ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీ ప్లాన్స్ కు గండి

Champions Trophy 2025: ఆస్ట్రేలియాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ కు గురైనా.., వన్డే సిరీస్‌లో మాత్రం శ్రీలంక శుభారంభం చేసింది. కొలంబో వేదికగా బుధవారం జరిగిన రెండు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఒక్కటిగా రాణించి 49 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఒకానొక దశలో ఓటమి కూరల్లో చిక్కుకొని ఈ మ్యాచ్ లో కూడా ఘోర పరాభవం తప్పదు అనుకున్న దశ నుండి శ్రీలంక పుంజుకొని విజయం సాధించడం వారికి ఎంతో స్ఫూర్తినిచ్చే విషయం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలింది. నిజానికి శ్రీలంక మరింత తక్కువ పరుగులకు ఆల్ అవుట్ కావాలి. ఒక దశలో వారు కేవలం 31 పరుగులకే తొలి నాలుగు వికెట్లను కోల్పోయారు. ఆ తర్వాత కెప్టెన్ అసలంక మరియు ఆల్ రౌండర్ వెల్లాలేగే ఇన్నింగ్స్ నువ్వు చెక్కబెట్టారు.

వీరిద్దరి 67 పరుగుల భాగస్వామ్యం ఇచ్చిన తర్వాత వెల్లాలేగే అవుట్ అయ్యాడు. అయితే అసలు ఇంకా మాత్రం మరొకవైపు తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇదే క్రమంలో చరిత్ అసలంక 126 బంతుల్లో 127 పరుగులు చేసి 14 ఫోర్లు, 5 సిక్స్‌లతో సెంచరీ సాధించగా, దునిత్ వెల్లాలేగే 30 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు తీయగా, స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు చెరిపారు. మాథ్యూ షార్ట్ ఒక వికెట్ తీశాడు.

ఇది కూడా చదవండి: IPL 2025 RCB Captain: ఆర్సీబీ కొత్త కెప్టెన్ కోహ్లి కాదు..! గట్టిగా వినిపిస్తున్న ఆ యువ ఆటగాడి పేరు..

రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఏ దశలోనూ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. వారు కూడా 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయారు. తర్వాత ఆస్ట్రేలియా 33.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లబుషేన్ 41 పరుగులు, ఆరోన్ హార్డీ 32 పరుగులు చేసి అత్యధిక పరుగుల స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ నాలుగు వికెట్లు తీసి 40 పరుగులు ఇచ్చాడు, అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తీయగా, వానిందు హసరంగా, చరిత్ అసలంక ఒక్కో వికెట్ తీశారు.

ఇక ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా ఈ వన్డే సిరీస్ ను తమ జట్టు కూర్పుల కోసం మరియు ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలి అనుకున్న నేపథ్యంలో ఇలాంటి ఒక పరాభవం వారి ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా దెబ్బతీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి స్టార్ ప్లేయర్లు దూరం అయిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ఎంతో క్లిష్టతరమైన గ్రూపులో ఉంది. ఈ పరిస్థితుల్లో నుండి వారు సెమీఫైనల్స్ చేరితే అది పెద్ద ఘనతనే చెప్పుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *