Ram Charan

Ram Charan: మరో యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గ్లోబల్ స్టార్?

Ram Charan: గేమ్ చేంజర్ తో దెబ్బతిన్న రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇక నానితో హాయ్ నాన్న వంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శౌర్యువ్, రామ్ చరణ్‌కు ఓ స్టోరీలైన్ చెప్పినట్లుగా సినీ సర్కిల్స్‌లో సమాచారం. దీనికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. దీంతో శౌర్యువ్ ఈ కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే చరణ్ ఈ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన ఎలాంటి కథతో వస్తాడా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *