Akkineni Nagarjuna: స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీకి బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజ్‌కుమార్ హిరానీ తన మున్నాభాయ్ సిరీస్ కి సీక్వెల్ గా మున్నాభాయ్-3ని చేస్తున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ కుమార్ సంజయ్ దత్ తో తాను చేసిన గత సినిమాల కంటే మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. అందుకే ఈ సినిమాలో ఓ సూపర్ క్యారెక్టర్ కోసం నాగార్జునని తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే మున్నాభాయ్ చిత్రాలను తెలుగులో శంకర్‌దాదా MBBS, శంకర్‌దాదా జిందాబాద్ అనే పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
