National Games

National Games: 38వ నేషనల్ గేమ్స్: తెలంగాణకు తొలి రజతం

National Games: ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వీరు పసిడి పతకం, కాంస్య పతకాలు సాధించారు కానీ రజతం పతకాలు సాధించడంలో విఫలమవుతూ వచ్చారు. అయితే ఆ ఎదురుచూపుకు తెరదించుతూ టైక్వాండో క్రీడాకారిని హర్షప్రద తనదైన శైలిలో మెరిసింది.

తెలంగాణ రాష్ట్రానికి 38వ జాతీయ క్రీడల్లో మొదటి పతకం రజత పతకంగా వచ్చింది. డెహ్రాడూన్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో మహిళల తైక్వాండోలో పాయం హర్షప్రద ఈ ఘనతను సాధించింది. శుక్రవారం ముగిసిన 73 కిలోల కియోర్గి విభాగం ఫైనల్‌లో చండీగఢ్ అమ్మాయి ఇతీషా దాస్ 2-0 తేడాతో తెలంగాణ ఆటగాడిని ఓడించింది. దీంతో హర్షప్రద రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: SA20 Final: నేడే SA20 ఫైనల్..! ముంబై వర్సెస్ సన్ రైజర్స్

సెమీఫైనల్‌లో ఉత్తరాఖండ్ ఆటగాడిని ఓడించి ఫైనల్‌కు చేరుకున్న హర్షప్రదను తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షుడు డి. సతీష్ గౌడ్, సాట్స్ ఛైర్మెన్ శివసేనారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో తెలంగాణ ఒక స్వర్ణం సహా మొత్తం ఆరు పతకాలతో 28వ స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ 4 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాలతో 18వ స్థానంలో ఉంది. సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ 38 స్వర్ణాలు సహా 64 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక 30 స్వర్ణాలు, మధ్యప్రదేశ్ 21 స్వర్ణాలు, హర్యానా 19 స్వర్ణాలతో టాప్-5లో ఉన్నాయి.

ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత ప్రముఖ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ స్వర్ణ పతకం సాధించింది. శుక్రవారం జరిగిన మహిళల 75 కేజీల విభాగం ఫైనల్‌లో లవ్లీనా 5-0 తేడాతో చండీగఢ్ కు చెందిన ప్రన్షు రాథోడ్ ను ఓడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *