Hyderabad: గొంగిడి త్రిషకు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్..

Hyderabad: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మహిళా క్రికెటర్ గొంగడి త్రిషను మర్యాద పూర్వకంగా కలిశారు. అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్తులో దేశం తరపున మరింత రాణించాలని ఆకాంక్షించారు. త్రిషకు ముఖ్యమంత్రి 1 కోటి రూపాయల నజరానా ప్రకటించారు. అండర్-19 వరల్డ్ కప్ టీమ్ సభ్యురాలు తెలంగాణ కు చెందిన ధృతి కేసరి కి 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.

అండర్-19 వరల్డ్ కప్ టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి కూడా 10 లక్షల రూపాయల చొప్పున నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వి. నరేందర్ రెడ్డి, శాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *