Health Tips: నడక అనేది శరీరానికి మేలును చేసే అత్యంత ప్రభావితమైన వ్యాయామం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది మరియు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా ఎసిడిటీ కూడా తగ్గుతుంది. మనసుకు శాంతి కలిగించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యకు ఆసుపత్రికి వెళితే డాక్టర్ ముందుగా అడిగేది మీకు వాకింగ్ అలవాటు ఉందా? కాకపోతే నడవమని సలహా ఇస్తున్నారు. నడక ఆరోగ్యానికి ఎంతో అవసరమని, వాకింగ్‌తో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీరు ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిది. ఏ సమయంలో నడక మరింత ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి నడక : బరువు తగ్గాలనుకునే వారికి నడక చాలా మంచి వ్యాయామం. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి , రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నడవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, శరీరంలోని విషపదార్ధాలు చెమట రూపంలో బయటకు వస్తాయి.
ఇది కూడా చదవండి: Gujarat bus accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడ్డ బస్సు, స్పాట్‌లోనే 48 మంది ..
ఖాళీ కడుపుతో నడక : ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నడవడం జీవక్రియను పెంపొందిస్తుంది. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది, కొవ్వును కరిగిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సూర్యకాంతిలో నడవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది.
తిన్న తరవాత నడక : భోజనం చేసిన వెంటనే నడవకూడదు. 5-10 నిమిషాల తరవాత నడవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నడక వల్ల గుండె జబ్బులు ప్రమాదం తగీ, మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుంది.

