AP News: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దయ్యలకుంట పల్లి వద్ద రెవెన్యూ ఉద్యోగి లక్ష్మీవతి రెడ్డి ఉరి వేసుకున్నాడు. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. క్రిష్ణవేణి అనే మహిళతో 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పదేళ్ల క్రితం క్రిష్ణవేణి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో తన అక్క కూతురు శ్రీవాణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు పుట్టింది. వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత కలహాలు తలెత్తాయి. దీంతో ఆరేళ్ల నుంచి శ్రీవాణి భర్తకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పెద్ద భార్య కుమారుడు, కూతురుతో కలిసి అనంతపురంలోని ద్వారాకా విల్లాస్‌లో ఉంటున్నాడు.
రెండో భార్య కాపురానికి రాకపోవడంతో ఆమె పుట్టినిల్లు దయ్యలకుంట పల్లికి వెళ్లాడు. ఆ సమయంలో వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది నరసమ్మ గుడి వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేషగిరి తెలిపారు.
