L2 Empuraan: మోహన్ లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో 2019లో వచ్చిన తొలి చిత్రం ‘లూసిఫర్’ చక్కని విజయాన్ని అందుకుంది. దాంతో దానికి సీక్వెల్ గా ‘ఎల్2ఇ ఎంపురాన్’ మూవీని చేస్తున్నాడు పృధ్వీరాజ్. ఈ సినిమాను సుభాస్కరన్, ఆంటోని పెరుంబవుర్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టీజర్ ను కొచ్చిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ”లూసిఫర్, బ్రో డాడీ” చిత్రాల తర్వాత మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. ఫుల్ ఎలివేషన్ షార్ట్స్ తో గూస్ బంప్స్ తెప్పించేలా ఈ టీజర్ సాగింది. చివరిలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ ఇవ్వడం కొసమెరుపు.
ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు మరోసారి వారి పాత్రలతో మెప్పించబోతున్నారు. మురళీ గోపి కథను అందించిన ఈ చిత్రానికి దీపక్ దేవ్ మ్యూజిక్, సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
