Odisha Warriors

Odisha Warriors: తొలి డబ్ల్యూహెచ్ఐఎల్ విజేతలుగా ఒడిశా వారియర్స్..!

Odisha Warriors: తొలిసారిగా నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ – డబ్ల్యూహెచ్ఐఎల్ టోర్నమెంట్ లో మొదటిసారి నిర్వహించిన మ్యాచ్లలో ఒడిశా వారియర్స్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఓడించింది.

ఒడిశా, సూర్మా క్లబ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఎంతో చాకచక్యంగా ఆడిన ఒడిశా జట్టు చివరికి టైటిల్ సొంతం చేసుకున్నారు. రుతుజా దాదాసో పిసాల్ 20వ, 56వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. సలీమా టెటె నాయకత్వంలో ఆడిన సూర్మా క్లబ్ జట్టుకు పెన్నీ స్క్విబ్ (28వ నిమిషంలో) ఒకే ఒక గోల్ సాధించింది.

విజయం సాధించిన ఒడిశా వారియర్స్ జట్టుకు రూ.1 కోటి 50 లక్షల ప్రైజ్ మనీ లభించింది. రన్నర్ అప్ సూర్మా క్లబ్ జట్టుకు రూ.1 కోటి ప్రైజ్ మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ప్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టుకు రూ. 50 లక్షలు లభించాయి.

ఇది కూడా చదవండి: Gautam Gambhir: గంభీర్ పై మరొకసారి విమర్శలు… కోచ్ కు ఆ మాత్రం తెలియదా…?

Odisha Warriors: టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్’ అవార్డు సూర్మా హాకీ క్లబ్ సవితా పూనియా పొందింది. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ను సోనమ్ , ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును జ్యోతి గెలుచుకున్నారు. వీరంతా సూర్మా హాకీ క్లబ్ కు చెందినవారు కావడం గమనార్హం.

అలాగే టోర్నమెంట్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఒడిశా వారియర్స్ కు చెందిన యిబ్బీ జాన్సెన్, సూర్మా హాకీ క్లబ్ జట్టు సభ్యురాలు అయిన చార్లోటి ఎంగ్లెబెర్ట్ ఇద్దరూ ఐదు గోల్స్ చేసి ‘టోర్నమెంట్ టాప్ స్కోరర్స్’గా నిలిచారు.

ఇక పురుషుల హాకీ ఇండియా లీగ్ విషయానికి వస్తే… హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 17 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. యూపీ రుద్రాస్ జట్టుతో రూర్కెలాలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ 3-1 తో విజయం సాధించింది. తూఫాన్స్ జట్టు తరఫున అర్ దీప్ సింగ్ రెండు గోల్స్, పిలాట్ ఒక గోల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *