ap crime news: అత్తా కోడ‌ళ్ల‌పై సామూహిక లైంగిక‌దాడి.. ఏపీ స‌త్య‌సాయి జిల్లాలో దారుణం

ap crime news: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో దారుణం చోటుచేసుకున్న‌ది. అత్తాకోడ‌ళ్ల‌పై ఐదుగురు దుండ‌గులు సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న వెలుగుచూసింది. వారి భ‌ర్త‌ల‌ను క‌ట్టేసి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు వెంట‌నే దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు.

ap crime news: శ్రీ స‌త్య‌సాయి జిల్లా చిల‌మ‌త్తూరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో నిర్మాణంలో ఉన్న పేప‌ర్ మిల్లులో బ‌ల్లారి నుంచి వ‌చ్చిన ఓ కుటుంబం కాప‌లా ఉంటున్న‌ది. త‌న భార్య‌తోపాటు త‌ల్లిదండ్రుల‌తో వాచ్‌మెన్ నివాసం ఉంటున్నాడు. శ‌నివారం రాత్రి బైక్‌లు వ‌చ్చిన‌ అలికిడి రావ‌డంతో వాచ్‌మెన్ తండ్రి బ‌య‌ట‌కు వెళ్లి టార్చ్‌లైట్ వేసి ఎవ‌రు మీరు, ఇక్క‌డికి ఎందుకు వ‌చ్చారు.. అని అడిగారు. ఈలోగా వాచ్‌మెన్ కూడా బ‌య‌ట‌కు రాగా తండ్రీకొడుకులపై దుండ‌గులు దాడి చేశారు. వారిద్ద‌రినీ కొంద‌రు ప‌ట్టుకోగా, గ‌దిలో ఉన్న‌ అత్తాకోడళ్ల‌పై ఐదుగురు దుండగులు సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు.

ap crime news: దాడి ఘ‌ట‌న అనంత‌రం దుండ‌గులు అక్క‌డి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు శ‌నివారం పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి, బాధితులను విచారించారు. కేసు న‌మోదు చేసుకొని దుండ‌గుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *