The Family Man 3

The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 3’ షూటింగ్ పూర్తి!?

The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ తో అద్భుతమైన విజయం అందుకున్నారు తెలుగు యువకలు రాజ్ డీకె. ఇక సెకండ్ సీజన్ లో సమంతను నటింప చేసి అంతకు మించిన సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో మూడో సీజన్ రాబోతోంది. ఇటీవల ‘హనీ బన్నీ’ సీరీస్ తో సత్తా చాటిన రాజ్ డీకె ‘ది ఫ్యామిలీ మ్యాన్3’ షూటింగ్ పూర్తయిన విషయాన్ని షేర్ చేశారు. తమ కెరీర్ లో ఇప్పటి వరకూ అతి కష్టమైన షూటింగ్ ఇదేనంటున్నారు. ఈ మూడో సీజన్ ను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. షూటింగ్ పూర్తి చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమతో పాటు శ్రమించిన నటీనటులు, టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోటోలలో మనోజ్ బాజ్ పేయి, సమంత, శ్రేయా ధన్వంతరి ఉన్నారు. ఈ సీరీస్ షూట్ ను నాగాలాండ్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. మరి తొలి రెండు సీరీస్ లాగే ఈ మూడో సీరీస్ కి కూడా వీక్షకాదరణ లభిస్తుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *