Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’ షూటింగ్ ను శరవేగంతో పూర్తి చేస్తున్న ప్రభాస్… ‘సలార్ -2’, ‘కల్కి -2’ ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంది. అలానే మరో పక్క ‘ఫౌజీ’ రెగ్యులర్ షూటింగ్ లోనూ ప్రభాస్ ఈ వారంలో పాల్గొంటాడని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’ అనే పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమా కథానుగుణంగా ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతుందట. దానికి తగ్గట్టుగానే అక్కడ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా జరపాలని సందీప్ రెడ్డి భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సందీప్ రెడ్డి ఓసారి జకార్తా వెళ్ళి వచ్చాడని, త్వరలోనే మూవీ టెక్నికల్ టీమ్ సైతం ఓసారి అక్కడకు వెళ్ళి వస్తుందని అంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ‘స్పిరిట్’ పట్టాలెక్కుతుందని సమాచారం. ‘స్పిరిట్’లో ప్రభాస్ రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరియబోతున్నాడట.
