Rinku singh: ఆ ఎంపీని పెళ్లాడబోతున్న క్రికెటర్ రింకు సింగ్

Rinku singh: టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడా? ఉత్తర‌ప్ర‌దేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) ప్రియా స‌రోజ్‌తో రింకూ సింగ్ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అయితే, ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి రింకూ సింగ్ గానీ, ప్రియా సరోజ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ప్రియా సరోజ్ ఇటీవ‌ల మ‌చ్లిష‌హ‌ర్ లోక్ సభ స్థానం నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఆమె ఢిల్లీ యూనివ‌ర్సిటీలో చదివి, సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పని చేశారు. ఇక, రింకూ సింగ్ భారత జట్టు తరఫున టీ20ల్లో కీలక ప్లేయర్.

ఇంకా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా ఈ యువ ఆటగాడు ప్రఖ్యాతి పొందాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, కేకేఆర్ రింకూను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *