KTR Investigation

KTR Investigation: కేటీఆర్‌ను 7 గంట‌లు విచారించిన‌ ఏసీబీ.. సంక్రాంతి త‌ర్వాత మ‌ళ్లీ పిలుపు!

KTR Investigation: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఏడు గంట‌ల‌పాటు విచారించారు. కేటీఆర్‌ గురువారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏసీబీ కార్యాల‌యానికి చేరుకున్నారు. త‌న వెంట న్యాయ‌వాదిని కార్యాల‌యంలోనికి హైకోర్టు అనుమ‌తించింది. అయితే ప‌రిమితికి లోబ‌డి విజుబుల్ డిస్టెన్స్‌లోనే లాయ‌ర్ ఉండేలా అనుమ‌తి ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్య‌వ‌హారంలో ఏసీబీ అధికారులు ప‌లు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు.

KTR Investigation: దాన‌కిషోర్ ఫిర్యాదు ఆధరంగా, ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వివ‌రాల మేర‌కు కేటీఆర్‌కు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌ధ్యాహ్నం కొద్దిసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ త‌ర్వాత కూడా విచార‌ణ‌ను కొన‌సాగించారు. సంక్రాంతి త‌ర్వాత మ‌రోసారి విచార‌ణ‌కు పిలుస్తామ‌ని ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు స్ప‌ష్టం చేశారు. అనంత‌రం సాయంత్రం కేటీఆర్ బ‌య‌ట‌కొచ్చారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఏసీబీ కోర్టు అనుమ‌తి

KTR Investigation: బ‌య‌ట ఎద‌రైన జ‌ర్న‌లిస్టుల‌తో కేటీఆర్‌ మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా, పోలీసులు వారించి, కారు డోరు తీయ‌నియ్య‌కుండా అక్క‌డి నుంచి పంపించి వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏసీబీ విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రించాన‌ని కేటీఆర్ తెలిపారు. నాకున్న అవ‌గాహ‌న మేర‌కు స‌మాధానాలు చెప్పాన‌ని పేర్కొన్నారు. రేవంత్ రాసిచ్చిన ప్ర‌శ్న‌ల‌నే ఏసీబీ అధికారులు తిప్పితిప్పి అడిగార‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నాలుగు ప్ర‌శ్న‌ల‌ను 40 సార్లు అడిగార‌ని, కొత్త‌గా అడిగిందేమీ లేద‌ని చెప్పారు. ఎన్నిసార్లు విచార‌ణ‌కు పిలిచినా వ‌స్తాన‌ని తేల్చిచెప్పారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Black Day 2025: ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కావచ్చు.. దేశభక్తులకు మాత్రం ఇది మరిచిపోలేని బ్లాక్ డే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *