Kaho Naa Pyaar Hai

Kaho Naa Pyaar Hai: పాతికేళ్ళ తర్వాత మరోసారి ‘కహోనా ప్యార్ హై’

Kaho Naa Pyaar Hai: ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత రాకేశ్‌ రోషన్ తనయుడు హృతిక్ పాతికేళ్ళ క్రితం ‘కహోనా ప్యార్ హై’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతోనే అమీషా పటేల్ సైతం చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ అప్పట్లో ఘన విజయం సాధించి, వీరిద్దరి కెరీర్ కు బలమైన పునాదిని వేసింది. ఈ నెల 10 హృతిక్ రోషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. చూస్తుండగానే 25 వసంతాలు గడిచిపోయాయని, ఈ రెండున్నర దశబ్దాల కాలంగా నటుడిగా పరిణితి చెందడానికే తాను కృషి చేశానని హృతిక్ తెలిపారు. ఈ సినిమా రీరీలీజ్ కానుండటం పై హర్షం వ్యక్తం చేశాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *