Breaking News: ప్రపంచం అంతా భయపడుతున్నట్టే చైనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసే పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కూడా ఇదే అనుమానంతో చైనా నుంచి ప్రపంచమంతా చుట్టేసి వినాశనానికి దారితీసింది. ఇదే ఇప్పుడు అదే చైనాలో పుట్టిన మరో వైరస్ అయిన హెచ్ఎంపీవీ మన దేశ ప్రజలనూ భయాందోళనకు గురిచేస్తున్నది. అందరూ భయపడుతున్నట్టుగానే మనదేశంలోకి ఆ వైరస్ పాకింది.
Breaking News: బెంగళూరు నగరంలో 8 నెలలు, 3 నెలల వయసున్న చిన్నారులిద్దరికీ హెచ్ఎంపీ వైరస్ అని ఐసీఎమ్మార్ నిర్ధారించింది. ఆ ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణాలు చేసే చరిత్ర లేదని తేల్చిచెప్పింది. అయినా ఆ వ్యాధి రావడం అందరినీ కలవర పెడుతున్నది. అయితే ఆ ఇద్దరికీ సాధారణ హెచ్ఎంపీ అని, ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పింది.

