Honeytrap

Honeytrap: వామ్మో పనిమనిషి.. హనీట్రాప్.. నాలుగు కోట్ల దోపిడీ

Honeytrap: కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పింకీ గుప్తా అనే మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తన సహచరులతో కలిసి ఓ ప్రముఖ జ్యోతిష్యుడిని హనీట్రాప్ చేసి రూ.4 కోట్లకు పైగా దోపిడీ చేసిందని ఆరోపణలతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె దోపిడీ చేసిన విధానం ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది.
నిందితురాలు పనికీ గుప్త అలఖ్‌ధామ్ నగరంలో ప్రసిద్ధ జ్యోతిష్కుడి దగ్గర ఏడువేల రూపాయాల జీతానికి పనిచేసేది.

మూడేళ్ళుగా అక్కడే పనిచేస్తోంది ఆమె. అయితే, ఆ జ్యోతిష్కుడి కొడుకు, కోడలు ఇంటిలో విలువైన వస్తువులు మాయమైనట్టు ఒకసారి గుర్తించారు. దీంతో వారికి పింకీపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను పనిలోంచి తీసేయమని జ్యోతిష్కుడికి చెప్పారు. కానీ, అతను వారి మాటను లెక్కచేయలేదు. ఇలా రెండు మూడుసార్లు జరగడంతో ఆయన కోడలికి అనుమానం వచ్చింది. పైగా పింకీ కేవలం జ్యోతిష్కుడి గాడి, డ్రాయింగ్ రూమ్ మాత్రమే శుభ్రం చేస్తోంది. దీంతో అనుమానం మరింత బలపడింది.

ఒకరోజు జ్యోతిష్కుడి కోడలు పనిమనిషి మొబైల్ ఫోన్ చెక్ చేసింది. దీంతో ఆమె మైండ్ బ్లాంక్ అయిపొయింది. ఎందుకంటే, పింకీ ఎకౌంట్ లో నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో ఆమె అనుమానం బలపడింది. మరింత పరిశిలనగా ఫోన్ చెక్ చేసింది. అప్పుడు అసలు బండారం బయట పడింది.

పింకీ తన మామను హనీట్రాప్ చేసిన విషయం ఆమెకు అర్ధం అయింది. ఆమె, ఆమె భర్త కలిసి జ్యోతిష్కుడిని నిలదీశారు. దీంతో అయన బోరు మంటూ అసలు విషయం చెప్పాడు. పింకీ, ఆమె ప్రియుడు రాహుల్ మాల్వియా కలిసి తనకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు తీసిందని చెప్పాడు. ఆ వీడియోలు చూపించి తనను బ్లాక్ మెయిల్ చేసినట్టు వెల్లడించాడు. దీంతో పింకీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో పింకీ బండారం మొత్తం బయటపడింది. సుమారు నాలుగు కోట్ల రూపాయలతో బాటు.. బంగారు నగలను జ్యోతిష్కుడిని బ్లాక్ మెయిల్ చేసి పింకీ దోచుకున్నట్టు పోలీసులు తేల్చారు.

ఈ కేసులో నీలగంగ పోలీస్ స్టేషన్ ముగ్గురు మహిళలను అరెస్టు చేసింది. వీరిలో పనిమనిషి సోదరి, తల్లి కూడా ఉన్నారు. కాగా, పనిమనిషి ప్రేమికుడు రాహుల్ పరారీలో ఉన్నాడు. అలాగే పనిమనిషి ఇంట్లో సుమారు రూ.45 లక్షల నగదు, రూ.55 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

ALSO READ  Aamir Khan: అమీర్ ఖాన్ పై నార్త్ ఆడియెన్స్ ఫైర్?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *