South Korea Plane Crash

South Korea Plane Crash: కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి

South Korea Plane Crash: ఆదివారం బ్యాంకాక్‌ నుంచి వస్తున్న జెజు ఎయిర్‌ విమానం దక్షిణ కొరియాలోని మువాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదం సమయం విమానంలో ప్రయాణిస్తున్న 181 మందిలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరిన జెజు ఎయిర్‌ విమానం దేశంలోని నైరుతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక రెస్పాన్స్ టీమ్, గాయపడిన ప్రయాణికులను రెస్క్యూ అధికారులు జెట్ వెనుక భాగం నుండి తరలిస్తున్నారు. ప్రమాదంలో 29 మంది మరణించినట్టు  రెస్పాన్స్ టీమ్ ఆఫీసర్ లీ హైయోన్-జీ, ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్‌తో చెప్పారు.

దక్షిణ కొరియాలోని సౌత్ జియోల్లాలో ఉన్న సౌత్-వెస్ట్ కోస్టల్ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 5:37 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:07 గంటలకు) విమాన ప్రమాదం జరిగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *