Sabarimala:

Sabarimala: శ‌బ‌రిమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Sabarimala: కేర‌ళ‌లోని ప్ర‌సిద్ధ శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్పస్వామి ఆల‌యానికి అయ్య‌ప్ప మాల‌ధారులు పోటెత్తారు. రోజురోజుకూ ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య పెరుగుతున్న‌ది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది స్వామివారిని ద‌ర్శించుకొని ఇరుముడి మొక్కులు అప్ప‌జెప్పారు. దీంతో శ‌బ‌రిమ‌ల ప‌రిస‌రాలు అయ్య‌ప్ప నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగుతున్నాయి. పంబా నది నుంచి శ‌బ‌రిమ‌ల వ‌ర‌కు వేలాది మంది అయ్య‌ప్ప మాల‌ధారులు వ‌ల‌స‌క‌ట్టారు.

Sabarimala: శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్పస్వామి ఆల‌యానికి నిన్న ఒక్క‌రోజే 1,00,000 మందికి పైగా భ‌క్తులు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకున్న‌ట్టు అంచ‌నా. మండ‌ల పూజ నేప‌థ్యంలో భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఆల‌యాధికారులు ఆ మేర‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. న‌వంబ‌ర్ 16న ప్రారంభ‌మైన మండ‌ల పూజ సీజ‌న్‌, డిసెంబ‌ర్ 26న స‌న్నిధానంలో జ‌రిగే ప్ర‌త్యేక పూజ‌తో ముగియ‌నున్న‌ది. రాబోయే రోజుల్లోనూ నిత్యం ల‌క్ష మందికి పైగా భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *