Oscars 2025

Oscars 2025: ఆస్కార్ లో ‘లాపాటా లేడీస్’ అవుట్ ‘సంతోష్’ ఇన్

Oscars 2025: ఇండియా నుంచి ఆస్కార్ కి అధికారింగా పంపించిన ‘లాపాటా లేడీస్’ పైనల్ గా షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించుకోలేక పోయింది. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు ఆయన భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించారు. అయితే ఆస్కార్ లో ఇండియా రేస్ ముగిసిపోలేదు. ఇండియాలోని గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించిన ‘సంతోష్’ అనే సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది.

ఇది కూడా చదవండి: KCR Movie: ఆహాలో ‘కేసీఆర్’ మూవీ

Oscars 2025: ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో యుకె తరపున ఈ సినిమా పోటీలో ఉంది. దీనికి సంధ్యాసూరి దర్శకత్వం వహించారు. మేలో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ సినిమా అక్టోబర్ లో ముంబై మామి ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమైంది. ఇంకా పలు చిత్రోత్సవాల్లో పలు అవార్డులను గెలుచుకుంది.

Oscars 2025: సహానాగోస్వామి, సునీతరాజ్వర్, సంజయ్ బిష్ణోయ్, కుశాల్ దూబే ఇందులోని తారాగణం. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో గట్టిపోటీని ఇచ్చి అవార్డులు గెలుచుకున్న ‘సంతోష్’ ఆస్కార్ లో సైతం తన ఉనికి చాటుతుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *