Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ సొంత టీవీ ఛానెల్..?

Thalapathy Vijay: తమిళనాడులోని ప్రధాన పొలిటికల్ పార్టీలకు  సొంత ఛానెల్స్ ఉన్నాయి. వాటి ద్వారా తమ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికే ప్రముఖ నటుడు విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ అనే పేరుతో పార్టీని పెట్టాడు. ఆ మధ్య భారీ బహిరంగ సభనూ నిర్వహించాడు. తమిళనాడులో నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుండి తన అభ్యర్థులను నిలబెట్టడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే చివరిగా ఒకే ఒక్క సినిమా చేసి, ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పాలని అనుకుంటున్నాడు. విశేషం ఏమంటే.. బాలకృష్ణ తెలుగులో చేసిన ‘భగవంత్ కేసరి’ మూవీ కి అది రీమేక్. ఇదిలా ఉంటే తన పార్టీ ప్రచారంకోసం, సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్ళడానికి విజయ్ కూడా సొంత ఛానెల్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *