SDT 18: మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. రోహిత్ కె.పి. ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి దుర్గ తేజ్ కు ఇది 18వ చిత్రం. ఈ హై బడ్జెట్ మూవీ గురించి మేకర్స్ లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 12న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ ను ప్రకటించడంతో పాటు గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఇంట్రూడ్ ఇన్టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో గతంలో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: Dil Raju: నిర్మాత దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి
