Raid 2: అజయ్ దేవ్ గన్ నటించిన ‘సింగం ఎగైన్’ సినిమా బాక్సాఫీస్ బరిలో పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన నటిస్తున్న మరో సినిమా ‘రైడ్ 2’ విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. నిజానికి ఈ యేడాది విడుదల కావాల్సిన ‘రైడ్ 2’ను ఫిబ్రవరి 21కి గతంలో వాయిదా వేశారు. ఇప్పుడు దానిని 2025 మే 1కి పోస్ట్ పోన్ చేశారు. 2018లో వచ్చిన ‘రైడ్’ మూవీ అప్పట్లో చక్కని విజయాన్ని అందుకుంది. అందులో అందులో ఐ.ఆర్.ఎస్. అధికారి అమేయ్ పాఠక్ గా అజయ్ దేవ్ గన్ నటించాడు. ఈ తాజా చిత్రంలో అజయ్ దేవ్ గన్ తో పాటు రితేష్ దేశ్ ముఖ్, వాణీ కపూర్, సౌరభ్ శుక్లా, రజత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముంబై, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, న్యూ ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాను రాజ్ కుమార్ గుప్తా డైరెక్ట్ చేశారు. ఇటీవల వచ్చిన రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ హిందీ ‘రైడ్’ సినిమాకు రీమేక్ కావడం విశేషం.
