super star krishna

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ హిట్ పండంటి కాపురం..

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ‘పండంటి కాపురం’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. 1965లో ‘తేనెమనసులు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ  ఏడేళ్ళ తర్వాత ‘పండంటి కాపురం’తో ఫస్ట్ గోల్డెన్ జూబ్లీని తన ఖాతాలో వేసుకున్నారు. అలా కృష్ణ కెరీర్ లో ఓ స్పెషల్ గా నిలచిన ‘పండంటి కాపురం’ 1972 సంవత్సరం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది… ఆ చిత్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం.

చిత్రసీమలో స్టార్స్ గా రాణించాలంటే సొంత చిత్రాలు తీయవలసిందే అని కొందరి నమ్మకం… అలా నమ్మినవారిలో కృష్ణ – ఆయన సోదరులు ఉన్నారు… సొంత చిత్రాలతోనే కృష్ణ ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ హీరో అనిపించుకున్నారు… అందుకు దోహద పడ్డ చిత్రాల్లో ‘పండంటి కాపురం’ కూడా ఉంది.

బలమైన కథ, దానిని పండించగలిగే తారాగణం ఉంటే… తప్పకుండా విజయలక్ష్మి వరిస్తుందని నిరూపించిన సినిమా ‘పండంటి కాపురం’.. ఈ సినిమా తెరకెక్కడానికి ముందు కూడా భలే కసరత్తు సాగింది… ఆ విశేషాలను తలచుకున్నా సరదాగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunnam: 18 ఏళ్ల తర్వాత రమణ గోగుల సాంగ్‌.. ‘గోదారి గట్టుమీద రామచిలకవే..’ రిలీజ్‌

Superstar Krishna: ‘పండంటి కాపురం’ సినిమా ఘనవిజయంలో కథ, కథనంతో పాటు ఇతర సాంకేతిక అంశాలూ చోటు చేసుకున్నాయి… ముఖ్యంగా ఎస్పీ కోదండపాణి సంగీతం ‘పండంటి కాపురం’ను పది కాలాలపాటు గుర్తుంచుకొనేలా చేసిందని చెప్పవచ్చు.

కృష్ణకు స్టార్ డమ్ ను సంపాదించి పెట్టడమే కాదు, అభిమానగణాలనూ పోగేసింది ‘పండంటి కాపురం’… ఈ నాటికీ ఈ చిత్రంలోని పాటలు, మాటలు జనాన్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి… కుటుంబ కథా సినిమాలపై ఇష్టం ఉండి.. కృష్ణ అభిమానులు అయితే  ‘పండంటి కాపురం’ సినిమాను చూడండి… మీరూ ఆ కథతో లీనమై పోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *