Narendra Modi: డిజిటల్ మోసం, సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వల్ల పొంచి ఉన్న ముప్పులపై భువనేశ్వర్‌లో జరిగిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల గురించి ఆయన చాలా విషయాపై మాట్లాడారు. ఈ సమయంలో, పోలీసులు ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం ద్వారా భారతదేశం “డబుల్ AI” శక్తిని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, పోలీసు సిబ్బంది పనిభారాన్ని తగ్గించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రధాన మంత్రి గట్టిగా చెప్పారు. వనరుల పంపిణీకి పోలీసు స్టేషన్లను కేంద్ర బిందువుగా చేయాలని సూచించారు. అర్బన్ పోలీసింగ్‌లో తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ, దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. అలాగే, స్మార్ట్ పోలీసింగ్ కాన్సెప్ట్‌ను వివరిస్తూ, దానిని వ్యూహాత్మకంగా, చక్కటి వ్యవస్థీకృతంగా, అనుకూలతతో, విశ్వసనీయంగా, పారదర్శకంగా తీర్చిదిద్దుతామని మోదీ చెప్పారు.
ఇది కూడా చదవండి: EVM Verification: మహారాష్ట్రలో ఈవీఎంల వెరిఫికేషన్ కోరిన 11 మంది అభ్యర్థులు
Narendra Modi: 2014లో గౌహతిలో జరిగిన కాన్ఫరెన్స్‌లో స్మార్ట్ పోలీసింగ్ అనే కాన్సెప్ట్‌ను ప్రధాన మంత్రి మొదటిసారిగా ప్రవేశ పెట్టారు. భారతీయ పోలీసింగ్ పనిలో మార్పులు తీసుకురావడమే దీని లక్ష్యం. భువనేశ్వర్‌లో జరిగిన 59వ ఆల్ ఇండియా డైరెక్టర్ జనరల్/ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా, డిజిటల్ మోసం, సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వల్ల కలిగే బెదిరింపులపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

