Paritala Sriram: పల్లెటూర్ల అంటేనే పచ్చని పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం… గ్రామాల్లో కుల మతాలకు అతీతంగా ఆప్యాయంగా పలకరింపులు కనిపిస్తాయి పల్లెల్లో ప్రగతి సాధించాలంటే ప్రకృతితో పాటు ప్రభుత్వాలు సహకరిస్తేనే రాష్ట్రం బాగుంటుంది. అప్పుడే గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ప్రకృతి ఆటుపోట్లు తట్టుకోవడానికి ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలతో అనేక చర్యలు చేపడుతుంటాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువులు శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు ముందు చూపుతో పరిశ్రమలతో పాటు తాగు, సాగు నీరుకి అత్యధిక ప్రాధాన్యతమిస్తున్నారు అనంతను హార్టీకల్చర్ హబ్‌గా మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Paritala Sriram: హంద్రీ నీవా కాలువ ద్వారా చిన్న చిన్న ప్రాజెక్టులతో పాటు చెరువులను నింపుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ముదిగుబ్బ మండల పరిధిలో పొడరాళ్లపల్లి, రాంసాగర్, గోపాలపురం, గుడ్డంపల్లి ఇలా అనేక గ్రామాల్లో భూగర్భ జలాలు కోసం పంటలు పండే విధంగా ఆ నాటిలోనే 1999 సంవత్సరంలోనే 0.4 టీఎంసీల నీటి నిల్వ ఉండే విధంగా జిల్లేడు బండ అనే ఆనకట్ట నిర్మించడంతో అక్కడ స్థానిక గ్రామాల్లో సాగు, తాగు నీరు, భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో ఆ గ్రామాల్లో పచ్చని తోటలు హార్టికల్చర్ హబ్ రైతులు మంచి పంటలు తీస్తున్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లేడు బండ ప్రాజెక్టును మార్చే విధంగా మాస్టర్ ప్లాన్ వేశారు.
Paritala Sriram: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లేడు బండ మాస్టర్ ప్లాన్‌కు స్థానిక రైతులకు మైండ్ బ్లాక్ అయింది అంట. ఎందుకంటే జిల్లేడు బండ మట్టితో నిర్మాణం చేపడుతున్న ఆనకట్ట ద్వారా డైరెక్ట్ పార్నపల్లి ప్రాజెక్ట్‌లోకి నీరుని తీసుకెళ్లి అక్కడి నుంచి పులివెందుల వైసీపీ నాయకుల సొంత పొలాలకు నీరు అందే విధంగా స్కెచ్ వేశారంట.వర్షాలు సరిగా కురువకపోయినా హంద్రీనీవా కాలవ ద్వారా మారాల ప్రాజెక్టు నుంచి జిల్లేడు బండ నింపే విధంగా జగన్మోహన్ రెడ్డి డిజైన్ చేశారంట ఎక్కడైనా రిజర్వాయర్ కడితే అక్కడ స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రూపు కల్పన చేస్తారు. కానీ జిల్లేడు బండ ప్రాజెక్టు మాత్రం దానికి విరుద్ధంగా స్థానిక రైతులకు ఏమాత్రం ఉపయోగపడకపోగా… పులివెందలకి మాత్రమే నీరును తీసుకువెళ్లే విధంగా ప్లాన్ చేయడం రైతన్నలు తీవ్రంగా వ్యతిరేకించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న కూడా ఆయన కమిషన్లల కోసం ప్రాజెక్టును ఒప్పుకున్నారనేది తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.
Paritala Sriram: ఆగ మేఘాల మీద గత వైసీపీ ప్రభుత్వం 2022లో ముదిగుబ్బ మండల పరిధిలోని పుడరాళ్లపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలోని జిల్లేడు బండ ప్రాజెక్టును నీటి సామర్థ్యం పెంచడానికి అత్యవసర జీవో తీసుకొచ్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు జిల్లేడు బండ నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు వరకు నిల్వ ఉండే విధంగా ఏకంగా ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్లు మేర మట్టి కట్టను అనాలోచితనంగా గత పాలకులు నిర్మాణం చేయడానికి మొగ్గు చూపారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం అయి ఉంటే దాదాపు పంటలు పండే 2వేల ఎకరాలు ముంపుకు గురయ్యావని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Paritala Sriram: జిల్లేడు బండ రైతుల పక్షాన ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పోరాటం చేస్తూనే ఉన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వలాభం… కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కమిషన్ కోసమే తూతూ మంత్రంగా గ్రామసభలు పెట్టి మామ అనిపించారు గ్రామాల్లోని రైతులు అభిప్రాయం తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టడంతోనే వాటిని అడ్డుకోవాల్సి వచ్చిందని పరిటాల శ్రీరామ్ చెప్పుకొచ్చారు పరిటాల శ్రీరామ్ రైతుల పక్షాన పోరాటం చేయడం వల్లే ఈ ప్రాజెక్టు ఆగింది ధర్మవరం అంటేనే పరిటాల కుటుంబం గుర్తొస్తుంది. గతంలో పరిటాల రవి ధర్మవరం ప్రజల కోసం పోరాటం చేశారు నేడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం ప్రజల కోసం నిలబడుతున్నారు.
Paritala Sriram: జిల్లేడు బండ ప్రాజెక్ట్ రైతుల పక్షాన ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ గత వైసీపీ ప్రభుత్వంపైన పోరాటానికి సై అన్నారు 2023లో వేలాది మంది రైతులతో జిల్లేడు బండ ప్రాజెక్టు మీద నిరసన తెలిపారు.
ప్రాజెక్టు పనులను అడ్డుకొని ఆ గ్రామాల రైతులకు అండగా నిలవడంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్మాణ పనులు అక్కడితో ఆగిపోయాయని చెప్పవచ్చు నాటి నుంచి నేటి వరకు పరిటాల శ్రీరామ్ జిల్లేడు బండ ప్రాజెక్ట్ బాధితులకు న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నారు జిల్లేడు బండ ప్రాజెక్ట్ సమస్యను సీఎం చంద్రబాబుతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి పరిటాల శ్రీరామ్ తీసుకెళ్లారు.
Paritala Sriram: జిల్లేడు బండ ప్రాజెక్టు సమస్యలను తెలుసుకోవడానికి పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో పాటు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనేకమంది ప్రజాప్రతినిధులతో పరిటాల శ్రీరామ్ రైతులతో చర్చా వేదిక నిర్వహించారు గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లేడు బండకు జరిగిన పనులను కూడా పరిశీలించారు. రైతులతో పాటు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారంట ఎందుకంటే మట్టి కట్టను ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మించడం అసాధ్యం… తూతూ మంత్రంగా మట్టి పోసేసి డబ్బులు తన్నుకు పోవడమే తప్ప … ఆ ప్రాంత రైతులకు ఏమాత్రం ఉపయోగపడదు. గత వైసీపీ పాలనలో ఏకంగా అన్నమయ్య లాంటి ప్రాజెక్టునే నీటిలో కొట్టుకుపోయే విధంగా వైసీపీ నిర్లక్ష్యంతో జరిగింది కడ స్థానిక ప్రజలు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సేమ్ జిల్లేడు బండ ప్రాజెక్టు పరిస్థితి కూడా అలానే ఉండేది అంటూ స్థానిక నాయకులు ఆవాక్కయ్యారంట.. కూటమి ప్రభుత్వం స్థానిక ప్రజల ద్వారా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వారు ఒపీనియన్ ప్రకారమే ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్తాయని ప్రజల సమక్షంలోనే ప్రజా ప్రతినిధులు చెప్పుకొచ్చారు… పరిటాల శ్రీరామ్ ఈ సభ నిర్వహించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Paritala Sriram: జిల్లేడు బండ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఏ మేరుక ఖర్చు పెట్టింది.. పక్క ఆధారాలతో సహా తమ ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తుందంటూ పరిటాల శ్రీరామ్ తెలిపారు ఈ ప్రాజెక్టు గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అదే విధంగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారంట… రైతులకు ప్రయోజనం ఉండే విధంగా ప్రాజెక్టును పునర్ పరిశీలన చెయ్యాలని అధికారులకు ఆదేశించినట్టు సమాచారం పరిటాల శ్రీరామ్ కృషితోనే జిల్లేడు బండ ముంపు ప్రాంత రైతన్నల్లో ఆశలు చిగురించాయంట… వైసీపీ అనాలోచనతో ఈ ప్రాజెక్టు పనులు జరిగి ఉంటే ఊర్లు ఊర్లు వదిలి వెళ్లాల్సి ఉండేది రైతులు పక్షాన పరిటాల శ్రీరామ్ ఒక్క అడుగు ముందుకు వేసి పోరాటం చేశారు. అనేక మంది రైతన్నలు కుటుంబాల్లో ఆనందం… సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లేడు బండ పాత ప్రాజెక్ట్ ఎలా ఉందో అలానే నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, సత్యకుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్‌లకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.