Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అతి త్వరలో హీరోగా తెరంగేట్రమ్ చేయబోతున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చింది. మోక్షజ్ఞ సోదరి తేజస్వినీ నందమూరి సమర్పకురాలిగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ వర్క్ జరుపుకోబోతున్న ఈ సినిమా నుండి మోక్షజ్ఞ చరిష్మాటిక్ స్టిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం మోక్షజ్ఞ పూర్తి స్థాయిలో మేకోవర్ జరిపినట్టు దీనిని చూస్తుంటే అర్థమౌతోంది. అలానే కెమెరాముందుకు వచ్చే ముందే నటన, ఫైట్స్, డాన్స్ లోనూ మోక్షజ్ఞ ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. పర్ఫెక్ట్ స్టైల్ చేసిన హెయిర్, గడ్డంతో, చెక్ షర్ట్ ధరించి చాలాఅందంగా అతను కనిపిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తామని చెబుతున్నారు.