Nara Lokesh

Nara Lokesh: ఫ్యాక్టరీలు కట్టడమే కాదు.. మీ హెడ్ క్వార్టర్స్ కూడా ఏపీకి షిఫ్ట్ చేయండి

Nara Lokesh: విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit-2026) ప్రారంభ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తన  ప్రసంగంతో గ్లోబల్ ఇన్వెస్టర్లను కట్టిపడేశారు! కేవలం సంప్రదాయ స్పీచ్‌లా కాకుండా.. ఏపీకున్న బలాలు, ఇక్కడ ఇప్పటికే గ్రౌండ్ అయిన భారీ ప్రాజెక్టుల లెక్కలను కళ్లకు కట్టినట్లు వివరించారు. “ఒక్కసారి ఏపీ గడ్డపై అడుగుపెట్టి ఇక్కడి స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, మా పనితీరు చూస్తే మీరు మళ్లీ ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లరు.. కేవలం ఫ్యాక్టరీలు కట్టడమే కాదు, మీ కంపెనీ హెడ్ క్వార్టర్స్ (ప్రధాన కార్యాలయాలు) కూడా విశాఖ, అమరావతి లేదా రాయలసీమకు మార్చేయండి” అంటూ పారిశ్రామికవేత్తలకు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు.

ఏపీ అంటే ఏంటో చెప్పిన నంబర్స్ – ఆసక్తికర ఫ్యాక్ట్స్!

మన రాష్ట్రం కేవలం ‘రైస్ బౌల్’ మాత్రమే కాదు, ఇప్పుడు ‘ఫ్రూట్ బౌల్’ (దేశ పండ్ల ఉత్పత్తిలో 16% వాటా) అని లోకేశ్ గర్వంగా చెప్పారు.
ఏసీలు, చాక్లెట్లు, రొయ్యలు: దేశంలో తయారయ్యే ఎయిర్ కండిషనర్లలో (AC) 60 శాతం, రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం, చాక్లెట్ల తయారీకి వాడే కోకో (Cacao) మరియు ఎండుమిర్చిలో 40 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయని వివరించారు. చేపలు, గుడ్ల ఉత్పత్తిలోనూ ఏపీనే నంబర్ వన్ అని తెలిపారు.
పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్: 1,000 కిలోమీటర్లకు పైగా ఉన్న సుదీర్ఘ తీరరేఖ ఏపీకి పెద్ద అసెట్. విశాఖ పోర్టుతో పాటు రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలలో 4 కొత్త గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు వస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో కార్గో సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నాం. ఆగస్టులో ప్రారంభమైన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు గేట్‌వేగా మారిందని ప్రధాని మోదీ, జీఎంఆర్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు.
3S మంత్రం.. ఇకపై ఈజ్ కాదు.. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’!
పెట్టుబడిదారులు ఏపీనే ఎందుకు ఎంచుకుంటున్నారో చెప్పడానికి లోకేశ్ ‘3S మంత్రం’ (Speed, Stability, Service) వివరించారు.
  1. స్పీడ్ (వేగం): ఇక్కడ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కాదు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నడుస్తోంది. రెమాండ్స్ (Raymond) సంస్థ రాయలసీమలో ఏరోస్పేస్ & డిఫెన్స్ ప్లాంట్‌ను 12 నెలల్లోపే అందుబాటులోకి తేవడం, ప్రీమియర్ ఎనర్జీ 18 నెలల్లో రూ.3,293 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ కట్టడం దీనికి నిదర్శనం.
  2. స్టెబిలిటీ (స్థిరత్వం): ప్రభుత్వాలు మారినా మా పాలసీలు మారవు. పరిశ్రమలకు రాయితీలు నేరుగా అందేలా దేశంలోనే తొలిసారిగా ‘ఎస్క్రో ఖాతా’ (Escrow Account) ఏర్పాటు చేశామని, త్వరలోనే ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్’ తెస్తున్నామని ప్రకటించారు.
  3. సర్వీస్ (సేవ): ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తే అది మీ ప్రాజెక్ట్ కాదు, మా సొంత ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసి రిబ్బన్ కట్ చేసే వరకు బాధ్యత నాదే అని భరోసా ఇచ్చారు.

రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు – గూగుల్, ఎల్జీ, కియా జోరు!

2024 జూన్ నుంచి ఇప్పటివరకు ఏపీకి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో 73% ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని, 51% ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయని లోకేశ్ తెలిపారు. వీటి ద్వారా 12.7 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.
విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల (దేశంలోనే అతిపెద్ద FDI) డేటా సెంటర్, శ్రీసిటీలో రూ.5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్, 25 వేల ఉద్యోగాలతో కాగ్నిజెంట్ డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతి క్వాంటం మిషన్‌లో భాగమైన ఎస్ఎస్‌డీ పాలిమర్స్ వంటి సంస్థల విజయాలను ప్రస్తావించారు. తాజా సదస్సు ద్వారా మరో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు, 2 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
ట్రాఫిక్ జామ్స్ లేని లైఫ్.. విశాఖ, అమరావతికి రండి!
ఇతర మెట్రో నగరాల్లా ట్రాఫిక్ జామ్స్, కాలుష్యం ఏపీలో లేవని.. స్వచ్ఛమైన గాలి, అందమైన బీచ్‌లు, అత్యుత్తమ టాలెంట్ (IT, AI, Quantum), పొలిటికల్ లీడర్‌షిప్‌కు నేరుగా యాక్సెస్ ఇక్కడ ఉన్నాయని లోకేశ్ అన్నారు. కాబట్టి పరిశ్రమలతో పాటు కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఏపీలో ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *