KING

KING: “హంతకుడిని కాదు.. ప్రేమికుడిని”.. ‘కింగ్’ న్యూ పోస్టర్‌ను రిలీజ్..ఆక‌ట్టుకుంటోన్న షారూక్ ఖాన్ స‌రికొత్త లుక్‌

KING: ‘కింగ్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్‌..యాక్షన్, ఇంటెన్సిటీతో పాటు రొమాన్స్‌ టచ్ ఉన్న లుక్‌తో షారూక్ ఖాన్ అద‌ర‌గొడుతున్నారు. పెదాల మధ్య గులాబీ పువ్వు.. నిప్పులు చెరిగే కంటి చూపు.. ఇలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ‘కింగ్’ కొత్త పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు రొమాన్స్‌ టచ్‌తో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో షారుఖ్ ఎలా కనిపించబోతున్నారో ఈ పోస్టర్ ఓ చిన్న గ్లింప్స్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై కొత్త పోస్టర్ మరింత అంచనాలను పెంచుతోంది.

‘కింగ్’ కొత్త పోస్టర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. భారీ యాక్షన్, పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ఈ పోస్టర్.. వెండితెరపై షారుఖ్ ఖాన్‌ను సరికొత్త అవతార్‌లో చూడాలనే ఆసక్తిని అభిమానుల్లో మరింత పెంచుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘కింగ్’ చిత్రం డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *