Janhvi Kapoor

Janhvi Kapoor: ‘పెద్ది’ వివాదంపై తప్పు ఒప్పుకున్న జాన్వీ కపూర్.. నెటిజన్లు ఫిదా!

Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా ‘పెద్ది’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అయితే, సినిమా రిలీజ్ సమయంలో ఆమె పాత్ర పైన, అలాగే కొన్ని గ్లామర్ సన్నివేశాలను  తెరకేకించిన విధానంపైన పెద్ద ఎత్తున విమర్శలు, వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉన్న జాన్వీ.. తాజాగా ఈ వివాదంపై ఓపెన్‌గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా తన తప్పును బహిరంగంగా అంగీకరిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

కాఫీ విత్ కరణ్‌లో జాన్వీ బోల్డ్ కామెంట్స్..

బాలీవుడ్ ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ తాజా ఎపిసోడ్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్.. ‘పెద్ది’ సినిమా వివాదంపై తన మనసులోని మాటను పంచుకున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో నేను మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సింది. ఒక నటిగా సమాజం పట్ల నాకు కూడా బాధ్యత ఉంటుంది. ఏదైనా సీన్ అభ్యంతరకరంగా అనిపించినప్పుడు వెంటనే దానిపై మాట్లాడాల్సింది. తప్పు జరిగినప్పుడు ఇతరులను లేదా దర్శకుడిని నిందించడం కంటే.. నా వంతుగా నేను ఏం చేయాల్సిందో ఆలోచించడమే కరెక్ట్ అని ఆమె స్పష్టం చేశారు.

ఇకపై అలాంటి సినిమాలు చేయను..

ఇదే షోలో కరణ్ జోహార్ సరదాగా మాట్లాడుతూ.. “హాలీవుడ్ బోల్డ్ మూవీ ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’కు దేశీ వెర్షన్ తీస్తే ఏ హీరోతో కలిసి నటిస్తావు?” అని జాన్వీని అడిగారు. దానికి ఆమె నవ్వుతూనే చాలా సీరియస్‌గా బదులిచ్చారు.

“‘పెద్ది’ సినిమాలో ఎదురైన చేదు అనుభవం తర్వాత అలాంటి సినిమాల జోలికి అస్సలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. భవిష్యత్తులో అలాంటి ప్రాజెక్ట్‌లు చేయను” అని కుండబద్దలు కొట్టారు.

బాలీవుడ్ టు టాలీవుడ్.. ఎందుకు ఇంత రచ్చ అయింది?

బాలీవుడ్‌లో జాన్వీ ఎన్నో గ్లామరస్ రోల్స్ చేసినప్పటికీ.. టాలీవుడ్‌లో ‘దేవర’ తర్వాత నటించిన ‘పెద్ది’ విషయంలోనే ఈ స్థాయి వివాదం రావడానికి కారణం లేకపోలేదు. తెలుగు ప్రేక్షకులు హీరోయిన్ల పాత్రల్లో సహజత్వం, ఎమోషన్‌ను ఎక్కువగా కోరుకుంటారు. కానీ ‘పెద్ది’లో ఆమె పాత్రను చూపించిన విధానంపై కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ టైమ్‌లో ఈ వివాదానికి సంబంధించిన కొన్ని చాట్స్ సోషల్ మీడియాలోకి లీకై వైరల్ అయ్యాయి. అప్పట్లో వివాదం రాజుకున్నప్పుడు ఎలాంటి ప్రకటన చేయని జాన్వీ.. ఇప్పుడు ఏమాత్రం దాపరికాలు లేకుండా తప్పును ఒప్పుకోవడం విశేషం.

నెటిజన్ల ప్రశంసలు: “రియల్ మెచ్యూరిటీ అంటే ఇదే!”

సాధారణంగా ఒక సినిమాలో ఏదైనా లోపం లేదా వివాదం తలెత్తితే హీరోహీరోయిన్లు దర్శకులపై నెట్టేయడం చూస్తుంటాం. కానీ ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి.. దర్శకుడిని తప్పుపట్టకుండా, “నేనే జాగ్రత్త పడాల్సింది” అని తన తప్పును అంగీకరించడం ఆమె మెచ్యూరిటీకి నిదర్శనమని సినీ ప్రియులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ అనుభవంతో పాఠాలు నేర్చుకున్న జాన్వీ.. భవిష్యత్తులో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుని సౌత్‌లో మరింత మంచి పేరు తెచ్చుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *