🚨 The ‘Girlfriend’ Case: FIR Against Malabar Gold!
A customer visited the Malabar Gold showroom in Bilaspur to exchange an old 22-carat HUID-hallmarked gold bracelet.
When tested on the machine, it showed 20-carat purity—every single time, across three separate tests.
However, after the jeweler made some adjustments to the machine, it suddenly displayed ‘916’ (indicating 22-carat gold)!
Following a complaint by the Bullion Association, the police registered an FIR against the showroom manager and the owner of the testing machine. The machine and the DVR have been seized.
The same piece of gold, yet two different readings—depending on who was watching!
If this was a mistake, Malabar Gold must provide an explanation. If it is part of their business model, then the situation is even more serious.
Hey @Grok, how much have people been swindled out of by Malabar Gold through such fraud?
#MalabarGold #GoldScam https://t.co/Xvq2Ili0nT
— Shivlal Patel | राष्ट्रवादी 🇮🇳 (@shivlalpatel18) October 26, 2026
Malabar Gold: మలబార్ గోల్డ్ షోరూమ్‌పై ఎఫ్ఐఆర్.. బంగారం స్వచ్ఛత టెస్టింగ్‌లో చేతివాటం?
Malabar Gold: ప్రముఖ నగల విక్రయ సంస్థ ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్’ బిలాస్పూర్ షోరూమ్‌లో బంగారం స్వచ్ఛతను లెక్కించే విధానం తీవ్ర వివాదాస్పదమైంది. పాత బంగారు ఆభరణం మార్పిడి (ఎక్స్ఛేంజ్) కోసం వచ్చిన ఒక కస్టమర్ నగల ప్యూరిటీని కావాలనే తక్కువ చేసి చూపించారనే ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ పోలీసులు షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్లపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
ఎక్స్ఛేంజ్ చేసుకునే సమయంలో విలువను తగ్గించి, గట్టిగా నిలదీయగానే సరైన రీడింగ్ చూపించారంటూ బాధితుడు మరియు స్థానిక నగల వ్యాపారి తీసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
అసలేం జరిగింది? వివాదానికి దారితీసిన ఘటన ఇదీ..
వివరాల్లోకి వెళితే.. బిలాస్‌పూర్‌కు చెందిన ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ కలిగిన బంగారు బ్రాస్లెట్ను ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు స్థానిక మలబార్ గోల్డ్ షోరూమ్‌కు వెళ్లారు. షోరూమ్ సిబ్బంది అక్కడున్న ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్ (XRF) ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్లో దాన్ని మూడుసార్లు పరీక్షించగా, ప్రతీసారీ అది కేవలం 20 క్యారెట్ మాత్రమే ఉన్నట్లు చూపించింది. పైగా ఆ ఆభరణంపై సరైన హాల్‌మార్క్ కూడా లేదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో కస్టమర్ తాను ఆ బ్రాస్లెట్ కొనుగోలు చేసిన స్థానిక నగల వ్యాపారిని అక్కడికి పిలిపించారు.
సెట్టింగ్ మార్చగానే మారిన రీడింగ్.. బయటపడ్డ బండారం
షోరూమ్‌కు వచ్చిన సదరు వ్యాపారి స్వయంగా బ్రాస్‌లెట్‌పై ఉన్న HUID నంబర్‌ను నిర్ధారించి, తమ ముందే మళ్లీ పరీక్షించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో అక్కడి ఉద్యోగి మెషీన్లో కొన్ని మార్పులు (సెట్టింగ్స్) చేయడంతో, అదే బ్రాస్లెట్ తదుపరి టెస్టింగ్‌లో 916 (22 క్యారెట్) ప్యూర్ గోల్డ్‌గా రీడింగ్ చూపించింది. ఒకే వస్తువు కొన్ని నిమిషాల వ్యవధిలోనే 2 క్యారెట్లు తక్కువగా చూపించడం, ఆ తర్వాత మళ్లీ సరిగ్గా రావడం వెనుక ఏదో మోసం దాగి ఉందని భావించిన స్థానిక వ్యాపారి ఆ దృశ్యాలను వీడియో తీశారు. దాంతో స్థానిక సరాఫా అసోసియేషన్ జోక్యం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల దర్యాప్తు.. మెషీన్, డీవీఆర్ సీజ్
బాధితుడు, సరాఫా అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. షోరూమ్ మేనేజర్‌తో పాటు మెషీన్ ఆపరేటర్‌పై మోసం కింద కేసులు నమోదు చేశారు. నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు వివాదానికి కారణమైన XRF టెస్టింగ్ మెషీన్‌తో పాటు షోరూమ్‌లోని సీసీటీవీ దృశ్యాలు నమోదైన డీవీఆర్‌ను (DVR) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బంగారం నాణ్యతను తక్కువ చేసి చూపించడం సాంకేతిక లోపమా లేక కస్టమర్ల నుంచి తక్కువ ధరకు బంగారం కొనేందుకు కావాలని చేస్తున్న క్యాలిబ్రేషన్ మార్పులా అన్న కోణంలో ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో పరీక్షలు జరుపుతున్నారు.
బిలాస్పూర్ మలబార్ గోల్డ్ షోరూమ్‌లో బంగారం స్వచ్ఛత పరీక్షలో తేడాలు రావడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత బంగారం ఎక్స్ఛేంజ్ చేసుకునేటప్పుడు వినియోగదారులు కూడా హాల్‌మార్క్, బిల్లులను సరిచూసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
