Revanth Reddy: హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియన్ స్టేట్స్ పోలీస్ కోఆర్డినేషన్ మీటింగ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ డీజీపీలు హాజరైన ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ శాఖను మునుపెన్నడూ లేని విధంగా టెక్-శావ్రీగా, మోడ్రన్‌గా మార్చేశామని చెప్పారు. ఇంటర్‌స్టేట్ క్రైమ్స్‌ను అడ్డుకోవడానికి అన్ని రాష్ట్రాల పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ చాలా అవసరమని గుర్తుచేశారు. ముఖ్యంగా యూత్‌ను నాశనం చేసే డ్రగ్స్ నెట్‌వర్క్‌లను తుత్తునియలు చేయడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో చెరువులు, గవర్నమెంట్ ల్యాండ్స్ కాపాడేందుకు ‘హైడ్రా’ (HYDRAA), అలాగే సేఫ్టీ కోసం ‘ఈగల్’, ‘టీజీ సేఫ్’ వంటి పవర్ఫుల్ వింగ్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేస్తున్న వర్క్‌కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవార్డులు ఇచ్చిందని గుర్తుచేస్తూ.. తెలంగాణను పూర్తిగా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చినందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అభినందించారని చెప్పారు.
ఇక సైబర్ క్రైమ్, పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టి క్లియర్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం లా అండ్ ఆర్డర్ కాపాడటమే కాకుండా, యూనిఫామ్ వేసుకుని రాత్రింబవళ్లు కష్టపడే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తుందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే పోలీసులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా నష్టపరిహారాన్ని ఏకంగా రూ. 2 కోట్ల వరకు పెంచామని గుర్తుచేశారు. ఈ మీటింగ్ కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఇంటర్‌స్టేట్ లెవల్‌లో నేరాలను అణచివేయడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు వెంటనే ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి గ్రౌండ్ లెవల్‌లో దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు.
