Crime News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని మంచి విషయాలకు వాడాల్సింది పోయి, కొందరు ఆకతాయిలు సమాజంలో భయాందోళనలు సృష్టించడానికి దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల పిచ్చితో కర్ణాటక రాష్ట్ర శాసనసభ భవనం ‘విధాన సౌధ’ (Vidhana Soudha) బాంబు దాడిలో పేలిపోయినట్లు ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఓ ఫేక్ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని బెంగళూరు పోలీసులు వేగంగా గుర్తించి కటకటాల్లోకి నెట్టారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో బాంబు పేలుడు డ్రామా..
Jnx king Hg అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఒక సింథటిక్ వీడియో అప్లోడ్ అయింది. అందులో ఒక వ్యక్తి ట్రిగ్గర్ నొక్కినట్లు సైగ చేయగానే.. వెనుక ఉన్న విధాన సౌధ భవనం భారీ శబ్దంతో, నిప్పులు చెలరేగుతూ ధ్వంసమై పేలిపోయినట్లు ఏఐ టెక్నాలజీతో రూపొందించారు.-
విధాన సౌధ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటన లేదా పేలుడు జరగలేదని, అదంతా ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియో అని అధికారులు వెంటనే అధికారికంగా స్పష్టం చేసి ప్రజల ఆందోళనలను నివారించారు.
-
ఐపీ అడ్రస్, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తు చేసి, బెంగళూరులో వలస కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన హజరత్ అలీ (అలీ)ని సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
నిందితుడిపై సంబంధిత ఐటీ చట్టాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాదాస్పద ఇన్స్టాగ్రామ్ ఖాతాను సైతం అధికారులు నిలిపివేయించారు (Deactivated).
-
నిందితుడు కేవలం వ్యూస్, ఫాలోవర్ల కోసమే ఈ పని చేశాడా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే దిశగా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఏఐ దుర్వినియోగంపై పోలీసుల కఠిన హెచ్చరిక..
AIతో అసెంబ్లీ పేల్చాడు.. చివరికి కటకటాలపాలయ్యాడు
బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీ పేల్చేసినట్లు AI వీడియో సృష్టించిన బీహార్ వ్యక్తి హజరత్ అలీ
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి కలకలం రేపిన నిందితుడు
అసెంబ్లీని పేల్చకుండానే.. AI వీడియోతో విధ్వంసం జరిగినట్లు చిత్రీకరణ
వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు
హజరత్ అలీని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపిన పోలీసులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 22, 2026
