ICICI Bank

ICICI Bank: డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. డబ్బులు వేసిన తీసిన.. ఛార్జీలు తప్పువు..!

ICICI Bank: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తమ సేవింగ్స్ ఖాతాదారులకు గట్టి షాక్ ఇచ్చింది. సేవింగ్స్ ఖాతాల్లో నిర్వహించే నగదు డిపాజిట్లు, విత్‌డ్రాల లావాదేవీల సేవా రుసుములను (Service Charges) సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ పెరిగిన కొత్త ఛార్జీలు 2026 డిసెంబర్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు బ్యాంక్ ఇప్పటికే తమ ఖాతాదారులకు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారాన్ని అందించింది. ముఖ్యంగా పరిమితికి మించి భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే కస్టమర్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
ఉచిత లావాదేవీల పరిమితి యథాతథం..
ఖాతాదారులకు ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. నెలవారీ ఉచిత లావాదేవీల సంఖ్యలో గానీ, ఉచిత విలువ పరిమితిలో గానీ బ్యాంక్ ఎలాంటి మార్పులు చేయలేదు..
నెలవారీ ఉచిత లావాదేవీలు: సేవింగ్స్ ఖాతాదారులు ప్రతి నెలా యథావిధిగా 3 ఉచిత నగదు డిపాజిట్లు, 3 ఉచిత నగదు విత్‌డ్రాయల్స్ చేసుకోవచ్చు.
నెలవారీ విలువ పరిమితి: డిపాజిట్లకు నెలకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు, అలాగే విత్‌డ్రాయల్స్‌కు కూడా నెలకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు (Complimentary Limit).
పెరిగిన ఛార్జీల లెక్కలివే..
నెలవారీ కాంప్లిమెంటరీ లిమిట్ అయిన రూ.1 లక్ష పరిమితిని దాటిన తర్వాత జరిపే లావాదేవీలపైనే ఈ పెంపు వర్తిస్తుంది..
వివరాలు ప్రస్తుత ఛార్జీలు డిసెంబర్ 1, 2026 నుంచి అమలయ్యే ఛార్జీలు
ఉచిత క్యాష్ డిపాజిట్లు నెలకు 3 నెలకు 3 (మార్పు లేదు)
ఉచిత క్యాష్ విత్‌డ్రాయల్స్ నెలకు 3 నెలకు 3 (మార్పు లేదు)
ఉచిత డిపాజిట్ విలువ నెలకు రూ.1 లక్ష వరకు నెలకు రూ.1 లక్ష వరకు
ఉచిత విత్‌డ్రాయల్ విలువ నెలకు రూ.1 లక్ష వరకు నెలకు రూ.1 లక్ష వరకు
లిమిట్ దాటిన లావాదేవీలపై ఛార్జీ ప్రతి రూ.1,000కి రూ. 3.50 (కనీసం రూ.150) ప్రతి రూ.1,000కి రూ. 4.00 (కనీసం రూ.150)
ఉదాహరణకు లెక్క ఇలా ఉంటుంది:
ఒక కస్టమర్ ఉచిత పరిమితి ముగిసిన తర్వాత నెలలో రూ.1.01 లక్షల లావాదేవీ చేస్తే.. కనీస ఛార్జీ అయిన రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. అదే లావాదేవీ విలువ రూ.1.38 లక్షలుగా ఉంటే.. ప్రతి వెయ్యికి రూ.4 చొప్పున లెక్కించి, కనీస ఛార్జీ కంటే ఎక్కువైన రూ.152 ఛార్జీగా వసూలు చేస్తారు.
వర్తించే లావాదేవీలు..
ఈ పెరిగిన ఛార్జీలు ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లలో నేరుగా చేసే నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌తో పాటు బ్యాంక్ క్యాష్ రీసైక్లర్ మెషీన్ల (CRM) ద్వారా నగదు జమ చేసేటప్పుడు కూడా వర్తిస్తాయి. నిర్దేశిత ఉచిత పరిమితిలోనే ఉండే సాధారణ కస్టమర్లపై ఈ పెంపు ప్రభావం ఏమాత్రం ఉండదు.
ఐసీఐసీఐ బ్యాంక్ తాజా ఎఫ్‌డీ (Fixed Deposit) వడ్డీ రేట్లు..
మరోవైపు రూ.3 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ సాధారణ పౌరులకు గరిష్టంగా 6.50%, సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.10% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది..
కాలపరిమితి (Tenure) సాధారణ పౌరులు (General) సీనియర్ సిటిజన్లు (Senior Citizen)
7 రోజుల నుంచి 45 రోజులు 2.75% 3.25%
46 రోజుల నుంచి 90 రోజులు 4.00% 4.50%
91 రోజుల నుంచి 184 రోజులు 4.50% 5.00%
185 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు 5.50% 6.00%
1 సంవత్సరం నుంచి 18 నెలల లోపు 6.25% 6.75%
18 నెలల నుంచి 2 సంవత్సరాలు 6.30% 6.80%
2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాలు 6.45% 6.95%
3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాలు 6.50% (అత్యధికం) 7.10% (అత్యధికం)
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలు 6.50% 7.00%
5 ఏళ్ల ట్యాక్స్ సేవర్ ఎఫ్‌డీ (Tax Saver FD) 6.50% 7.10%
బ్యాంక్ శాఖలకు వెళ్లి నగదు లావాదేవీలు జరిపే వారు అనవసరపు ఛార్జీల భారం పడకుండా డిజిటల్ పేమెంట్లు (UPI, నెట్ బ్యాంకింగ్) లేదా ఉచిత నెలవారీ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *