Hrithik Roshan: సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ థియేటర్లలోకి వచ్చి అదిరిపోయే ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోసారి థియేటర్లను ఊపేస్తోంది. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్లోనూ వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులను పవర్ఫుల్ క్యామియో పాత్రల కోసం రంగంలోకి దించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నప్పటికీ.. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ చేసిన అతిథి పాత్ర మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
నిమిషం కూడా లేని రోల్.. రూ.25 కోట్ల పారితోషికం?
ఈ సినిమాలో క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఒక కీలక సన్నివేశం కోసం హృతిక్ రోషన్‌ను తీసుకున్నారు.. సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే హృతిక్ రోషన్ పాత్ర స్క్రీన్‌పై కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం మాత్రమే కనిపిస్తుంది. ఎడిటింగ్‌లో ఆయన సన్నివేశాలను కత్తెరించారా లేక కథ ప్రకారమే అంత చిన్న రోల్ రాసుకున్నారా అనేది క్లారిటీ లేనప్పటికీ.. అంత పెద్ద స్టార్‌ను అంత చిన్న పాత్రకు వాడటంపై సినీ ప్రియులు పెదవి విరుస్తున్నారు.
భారీ రెమ్యునరేషన్ రచ్చ..
ఈ అతి స్వల్ప నిడివి పాత్ర కోసమే హృతిక్ రోషన్‌కు ఏకంగా రూ.25 కోట్ల భారీ పారితోషికం ముట్టజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కథలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర కోసం అంత భారీ మొత్తం ఖర్చు చేయడానికి బదులుగా వేరే ఇతర ఆప్షన్లను చూసుకుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మిగతా స్టార్ల రెమ్యునరేషన్లు ఎంతంటే?..
హృతిక్ రోషన్‌తో పోలిస్తే మిగిలిన నటీనటులకు ఇచ్చిన పారితోషికాలు చాలా డీసెంట్‌గా ఉన్నాయనే టాక్ నడుస్తోంది..
-
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్: మొదటి భాగంలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లను షేక్ చేసిన శివన్నకు ఈ సీక్వెల్ కోసం రూ.8 కోట్లు రెమ్యునరేషన్‌గా ఇచ్చారు.
-
విద్యాబాలన్: లేడీ ఓరియెంటెడ్ రోల్స్ చేసే బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి, ప్రాధాన్యతకు తగినట్లుగా రూ.6 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
‘జైలర్ 3’కి లీడ్ ఇచ్చిన విజయ్ సేతుపతి – రజినీకాంత్ రెమ్యునరేషన్..
ఈ సినిమాలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి పాత్ర విషయంలో మేకర్స్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.. సినిమా మొత్తం విజయ్ సేతుపతి కనిపించకపోయినా.. చివర్లో ఎండ్ క్రెడిట్స్ రోల్ అవుతున్న సమయంలో ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఈ సీన్ నేరుగా ‘జైలర్ 3’కి బలమైన లీడ్ ఇస్తూ ముగుస్తుంది. రజినీకాంత్‌పై ఉన్న అపారమైన గౌరవంతో విజయ్ సేతుపతి ఈ పాత్రకు చాలా తక్కువ పారితోషికం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ సినిమాకి ఏకంగా రూ.180 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇందులో రూ.110 కోట్లు బేస్ రెమ్యునరేషన్ కాగా, మిగిలిన మొత్తాన్ని ప్రాఫిట్ షేరింగ్ (లాభాల్లో వాటా) మోడల్ కింద అందుకోనున్నారు. నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్‌తో ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద పరుగు కొనసాగిస్తున్నప్పటికీ.. హృతిక్ రోషన్ క్యామియో లెక్కలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ డిబేట్‌గా మారాయి.
