Foreign Liquor Prices Hike 

Prices Hike: దసరా వేళ మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన మద్యం ధరలు

Foreign Liquor Prices Hike: దసరా శరన్నవరాత్రి పండుగల సంబరాల్లో ఉన్న మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రముఖ ప్రీమియం మద్యం బ్రాండ్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, వోడ్కా, జిన్, టేకిలా, వైన్, షాంపైన్ వంటి ఏకంగా 352 విదేశీ బ్రాండ్ల గరిష్ఠ రిటైల్ ధరలను (MRP) సవరిస్తూ తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (TGBCL) అధికారిక సర్క్యులర్ జారీ చేసింది.

వివిధ బ్రాండ్లపై సగటున దాదాపు 6 శాతం వరకు ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం విదేశీ మద్యంపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో రేట్లు తగ్గుతాయని ఆశించిన మందుబాబులకు ఈ పెంపు తీవ్ర నిరాశను మిగిల్చింది. సవరించిన ధరలు తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది.
కొత్త ఎంఆర్‌పీల వివరాలు: విస్కీ, వోడ్కా, ప్రీమియం వైన్ రేట్లు ఇవే!
సవరించిన నూతన రేట్ల ప్రకారం టాప్ బ్రాండ్ల మద్యం సీసాల ధరల జాబితా..
  • సింగిల్ మాల్ట్ & స్కాచ్ విస్కీ బ్రాండ్లు..
    • గ్లెన్‌మోరంగీ సిగ్నెట్ (Glenmorangie Signet 750ml): రూ. 50,660
    • గ్లెన్‌మోరంగీ 18 ఇయర్స్ (Glenmorangie 18 YO 750ml): రూ. 27,270
    • రాయల్ సెల్యూట్ 21 ఇయర్స్ (Royal Salute 21 YO 700ml): రూ. 27,220
    • యమజాకి డిస్టిలర్స్ రిజర్వ్ (The Yamazaki 700ml): రూ. 17,450
    • హిబికి జపనీస్ హార్మొనీ (Hibiki Harmony 700ml): రూ. 17,400
    • గ్లెన్ గ్రాంట్ 18 ఇయర్స్ (Glen Grant 18 YO 750ml): రూ. 13,420
    • శివాస్ రీగల్ 18 ఇయర్స్ (Chivas Regal 18 YO 750ml): రూ. 10,540
    • గ్లెన్‌ఫిడిచ్ 15 ఇయర్స్ (Glenfiddich 15 YO 700ml): రూ. 10,510
    • గ్లెన్‌ఫిడిచ్ 12 ఇయర్స్ (Glenfiddich 12 YO 700ml): రూ. 7,910
    • టాలిస్కర్ 10 ఇయర్స్ (Talisker 10 YO 750ml): రూ. 7,430
    • లాఫ్రోయిగ్ సెలెక్ట్ (Laphroaig 750ml): రూ. 7,100
    • జానీ వాకర్ బ్లాక్ లేబుల్ (Johnnie Walker Black Label 750ml): రూ. 5,140
    • శివాస్ రీగల్ 12 ఇయర్స్ (Chivas Regal 12 YO 750ml): రూ. 4,940
    • జె అండ్ బి రేర్ (J&B Rare Scotch 750ml): రూ. 2,730
    • జానీ వాకర్ రెడ్ లేబుల్ (Johnnie Walker Red Label 750ml): రూ. 2,650
  • వోడ్కా, జిన్ & టేకిలా ధరలు:
    • బెల్వెడెరే ప్యూర్ వోడ్కా (Belvedere Pure 700ml): రూ. 7,280
    • హెండ్రిక్స్ జిన్ (Hendrick’s Gin 700ml): రూ. 6,940
    • బెలుగా నోబుల్ రష్యన్ వోడ్కా (Beluga Noble 700ml): రూ. 5,810
    • గ్రే గూస్ వోడ్కా (Grey Goose 750ml): రూ. 5,050
    • బాంబే సఫైర్ లండన్ డ్రై జిన్ (Bombay Sapphire 750ml): రూ. 2,820
    • ఆబ్సల్యూట్ వోడ్కా (Absolut Vodka 750ml): రూ. 2,680
  • లగ్జరీ వైన్ & షాంపైన్:
    • డొమ్ పెరిగ్నాన్ రోజ్ షాంపైన్ (Dom Perignon Rose 750ml): రూ. 1,16,560
    • మోయెట్ అండ్ చాన్డన్ ఐస్ షాంపైన్ (Moet Chandon Ice 750ml): రూ. 18,870
    • మోయెట్ అండ్ చాన్డన్ బ్రూట్ (Moet & Chandon Brut 750ml): రూ. 14,270

నిబంధనలు మీరితే లైసెన్సులు రద్దు – ఎక్సైజ్ శాఖ వార్నింగ్..

రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు సవరించిన ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించాలని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడినా వ్యాపారులపై కఠిన చట్టపరమైన చర్యలతో పాటు షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.
41 కొత్త బార్లకు దరఖాస్తుల వెల్లువ – ప్రభుత్వానికి రూ.87.71 కోట్ల ఆదాయం!
మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 41 బార్ల లైసెన్సుల నోటిఫికేషన్‌కు దరఖాస్తుదారులు పోటెత్తారు..
  • 8,771 దరఖాస్తులు – బంపర్ రాబడి.. 
    మొత్తం 41 బార్లకు గాను 8,771 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు తిరిగి చెల్లించని రుసుము (Non-refundable fee) కింద రూ. లక్ష చొప్పున నిర్ణయించడంతో.. కేవలం దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వ ఖజానాకు రూ. 87.71 కోట్ల ఆదాయం సమకూరింది.
  • క్యూర్‌ (CURE) పరిధిలోనే సగం అప్లికేషన్లు..
    హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో 14 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఏకంగా 4,252 దరఖాస్తులు వచ్చాయి (సగటున ఒక్కో బార్‌కు 303 దరఖాస్తులు). ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని 27 బార్లకు మిగిలిన దరఖాస్తులు వచ్చాయి.
  • భారీ పోటీ ఉన్న ప్రాంతాలు..
    మొయినాబాద్‌లో 2 బార్లకు ఏకంగా 664 దరఖాస్తులు రాగా.. ములుగులో ఒక బార్‌కు 376, అశ్వారావుపేటలో 357, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 349, కేసముద్రంలో 331, కల్లూరులో 325 దరఖాస్తులు నమోదయ్యాయి. అదే సమయంలో బోధన్‌లో 19, కొడంగల్‌లో 27, పరిగిలో 36 మాత్రమే రావడం గమనార్హం.
ఈ నెల 16న లాటరీ పద్ధతి ద్వారా లక్కీ డ్రా తీసి నూతన బార్ల నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఉన్న బార్ ఓనర్లు నష్టాలు వస్తున్నాయని, పన్నుల భారం తగ్గించాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. కొత్త బార్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *