germany-cologne-police-investigate-sexual-harassment-by-remote-controlled-robot-two-teenagers-held

Robot Harassment: 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు.. అసలేం జరిగింది?

Robot Harassment: సాంకేతికతను ఆకతాయి పనులకు, మహిళలను వేధించడానికి ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చాటిచెప్పే అత్యంత వింతైన, విచారకరమైన ఘటన జర్మనీలో వెలుగుచూసింది. రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే ఓ రోబో సహాయంతో 16 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జర్మన్ అధికారులు క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించారు.

పశ్చిమ జర్మనీలోని కొలోన్ (Cologne) నగరంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఈ ఘటనను ఇద్దరు టీనేజర్లు సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
రోడ్డుపై రోబోతో అసభ్య విన్యాసాలు – అసలేం జరిగింది?..
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొలోన్ నగరంలోని రద్దీగా ఉండే ఓ వీధిలో ఇద్దరు యువకులు ఒక వింత రోబోను నడిపిస్తూ కనిపించారు. దాదాపు 120 సెంటీమీటర్ల (సుమారు 3 అడుగుల 11 అంగుళాలు) ఎత్తు ఉన్న ఆ ఎరుపు-బంగారు రంగు రోబోకు తెల్లటి బనీయన్, నల్లటి ట్రాక్ ప్యాంట్ వేసి, మెడలో బంగారు గొలుసు, కళ్లకు సన్‌గ్లాసెస్, ముఖానికి నకిలీ మీసాలు కూడా అమర్చారు.
మహిళలను అసభ్యంగా తాకుతూ లైవ్..
అక్కడే ఉన్న మహిళల గ్రూపుల వద్దకు ఆ రోబోను పంపించారు. కొందరిని బలంగా ఢీకొట్టడం, హగ్ చేసుకోవడం చేసింది. అంతటితో ఆగకుండా ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక పిరుదులను అసభ్యంగా తాకడంతో పాటు, ఆమెపైకి అసభ్యకరమైన శారీరక కదలికలు (thrusting movements) చేసింది.
లైవ్‌లో రికార్డింగ్ – జనాలు చూసి నవ్వులు..
రోబో యజమానిగా భావిస్తున్న 16 ఏళ్ల బాలుడు, అతడి 19 ఏళ్ల స్నేహితుడు ఈ వ్యవహారాన్నంతటినీ తమ మొబైల్ ఫోన్లలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కామెంట్రీ ఇచ్చారు. రోబో అసభ్యంగా ప్రవర్తించినప్పుడల్లా అరుస్తూ వెనక్కి లాగుతూ చుట్టుపక్కల వారిని నవ్వించే ప్రయత్నం చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు – రోబో సీజ్..
సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు స్థానిక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ సమీపంలో తనిఖీలు చేపట్టాయి. నిందితులు అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేయగా.. వారి కారు ట్రంక్ (డిక్కీ)లో ఉన్న రోబోను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు యువకుల మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.
రిమోటా లేక ప్రీ-ప్రోగ్రామింగా?..
ఆ రోబో కదలికలను వారు ముందే కోడింగ్ (Pre-programmed) చేసి సెట్ చేశారా? లేక రిమోట్ ద్వారా అక్కడికక్కడే లైవ్‌లో కంట్రోల్ (Real-time control) చేశారా? అనే కోణంలో ఫోరెన్సిక్ పరీక్షలు జరుపుతున్నారు.
ఇలాంటి కేసు మాకు సరికొత్త సవాల్కొ.. లోన్ పోలీసుల ప్రకటన
కొలోన్ పోలీస్ ప్రతినిధి క్రిస్టోఫ్ బెర్మెల్ మాట్లాడుతూ.. ఇంతవరకు రోబోలతో లైంగిక వేధింపులకు పాల్పడే ఇలాంటి వికృత ఘటనలను మేము ఎప్పుడూ చూడలేదు. చట్టపరంగా, దర్యాప్తు పరంగా ఇది మాకు సరికొత్త సవాలు (New territory)” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఆ ఇద్దరినీ ప్రధాన అనుమానితులుగా పరిగణిస్తున్నామని, దర్యాప్తు అనంతరం అధికారిక అభియోగాలు మోపుతామని తెలిపారు.
మరోవైపు, నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియా పోలీస్ విభాగం ఈ ఘటనకు సంబంధించిన రోబో ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు, మైనర్లపై ఇలాంటి అసభ్య ప్రవర్తనలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో జోకులు వేయడం, మీమ్స్ షేర్ చేయడం బాధితులను మరింత క్షోభకు గురిచేస్తుందని, అలాంటి వారిపై కూడా సైబర్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *