Guntur

Guntur: విధుల్లో నిర్లక్ష్యం.. గుంటూరులో ఇద్దరు వార్డు అడ్మిన్ కార్యదర్శుల సస్పెన్షన్

Guntur: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డు అడ్మిన్ కార్యదర్శులను కమిషనర్ కె.మయూర్ అశోక్ సస్పెండ్ చేశారు. ఈఆర్‌పీ విధానంలో ఆస్తిపన్ను సేవలను నిర్ణీత గడువు దాటినా పరిష్కరించకుండా ఆటోనగర్-02 సచివాలయానికి చెందిన డి.పద్మావతి 103 సేవలను, కొండవారివీధి-03 సచివాలయానికి చెందిన కె.సుందర్ సింగ్ 58 సేవలను పెండింగ్‌లో ఉంచగా, షోకాజ్ నోటీసులకు వారు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో APCS (CCA) Rules, 1991 లోని రూల్ 8(1) ప్రకారం వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజలకు సేవలందించడంలో ఇలాంటి అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *